IPL 2023 Updates: ఐపీఎల్ జోరుగా సాగుతోంది. భారీ స్కోర్లతో ప్రేక్షకులను అన్ని జట్లు అలరిస్తున్నాయి. ఇప్పటివరకు అన్ని జట్లు దాదాపు ఐదు మ్యాచ్‌లు ఆడేశాయి. రెండు మ్యాచ్‌లు ఆడితే.. ఔఫస్ట్‌ హాఫ్ కంప్లీట్ అవుతోంది. ఇప్పటికే అనేక మంది సత్తా చాటుకుంటుండగా.. చాలా మంది ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయంగా సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన ఆటగాళ్లకు కూడా ఈ సీజన్‌లో ఆడే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ దూకుడు బ్యాటింగ్‌కు మారుపేరు. క్రీజ్‌లో ఉన్నంతసేపు సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తిస్తాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో రాయ్ అద్భుత ప్రదర్శన చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేసన్ రాయ్‌కు ఇంకా కేకేఆర్ తుది జట్టులో చోటు కల్పించలేదు. వరుస ఓటముల నేపథ్యంలో తరువాతి మ్యాచ్‌లకు రాయ్‌ను ప్లేయింగ్‌ 11లో తీసుకునే ఛాన్స్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కూడా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో రూట్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బట్లర్, హిట్‌మేయర్, హోల్డర్, ట్రెండ్ బౌల్ట్, జంపా వంటి విదేశీ ప్లేయర్లు ఉండడంతో రూట్‌కు ప్లేస్ కష్టమవుతోంది. వెస్టిండీస్ స్పీడ్‌స్టార్ ఒబెడ్ మెక్‌కాయ్ పరిస్థితి కూడా అంతే ఉంది. రాజస్థాన్ రాయల్స్‌లో ఇప్పటివరకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. గత సీజన్‌లో ఒబెడ్ మెక్‌కాయ్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సెకాండఫ్‌లో మెక్‌కాయ్‌ను రంగంలో దింపే అవకాశం ఉంది.


శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. ఇటీవల టీ20ల్లో అదరగొట్టిన షనక.. గుజరాత్ టైటాన్స్‌ జట్టులో ఉన్నాడు. షనకకు కూడా సెకాండఫ్‌లో తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్‌ ఉంది. గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ కూడా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత సీజన్‌లో మాథ్యూ వేడ్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటిల్ గెలవడంలో కీరోల్ ప్లే చేశాడు. వృద్ధిమాన్ సాహా ప్లేస్‌లో వేడ్‌ను తీసుకునే అవకాశం ఉంది. 


Also Read: Digital Highways: రహదారులకు కొత్తరూపు.. హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు


వెస్టిండీస్ పేస్ బౌలర్ అకిల్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీ20 లీగ్‌లు జరిగినా.. తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకిల్ హుస్సేన్.. తుది జట్టులో చోటు దక్కితే సత్తా చాటగలడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ప్లేయింగ్‌ 11లో చోటు దక్కని మరో ప్లేయర్ లుంగిసాని ఎంగిడి. చెన్నై జట్టులో ఉన్న ఎంగిడి.. సెకాండఫ్‌లో కీరోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది.


Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook