Chennai Super Kings Captain MS Dhoni Will Get Banned From IPL 2023 Final Due To Slow Over Rate in GT vs CSK Match: ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (60; 44 బంతుల్లో 7×4, 1×6), డెవాన్ కాన్వే (40; 34 బంతుల్లో 4×4) రాణించారు. గుజరాత్ బౌలర్లు మొహ్మద్ షమీ (2/28), మోహిత్‌ శర్మ (2/31) తలో రెండు వికెట్స్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (42; 38 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌ కాగా.. రషీద్‌ ఖాన్‌ (30; 16 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (2/18), మహీశ తీక్షణ (2/28), దీపక్‌ చహర్‌ (2/29) దెబ్బ కొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 ఐపీఎల్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి. మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2023 ఫైనల్ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లలో ఒక దానితో చెన్నై తలపడనుంది. ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై.. మరో కప్ అందుకునేందుకు సిద్ధంగా ఉంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో చెన్నై కప్ కొడుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచుకు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. 


మంగళవారం చెపాక్ మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంపైర్‌తో వాగ్వాదంకు దిగాడు. దాంతో 4 నిమిషాల సమయాన్ని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్‌ రిఫరీ చెన్నై కెప్టెన్ ధోనీపై చర్యలు తీసుకోనున్నారని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ తమ కథనంలో పేర్కొంది. ఫైన్‌ లేదా ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం ఉందట.  ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై చర్చించనుందట. ఒకవేళ ఓ మ్యాచ్ నిషేదం పడితే మాత్రం ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచుకు మహీ దూరమవుతారు. ఇదే జరిగితే చెన్నైకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 


గుజరాత్‌ టైటాన్స్ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసేందుకు చెన్నై బౌలర్ మతీషా పతిరాణా సిద్దమయ్యాడు. అయితే పతిరాణా బౌలింగ్‌ చేయడానికి ఫీల్డ్‌ అంపైర్‌లు ఒప్పుకోలేదు. 15 ఓవర్‌ వేసేముం‍దు పతిరాణా దాదాపుగా 10 నిమిషాలు మైదానంలో లేడు. నేరుగా డగౌట్‌ నుంచి బౌలింగ్‌ చేయడానికి సిద్దపడిన పతిరాణాను అంపైర్‌లు అడ్డుకున్నారు. దాంతో అంపైర్‌ల వద్దకు వచ్చి ఎంఎస్ ధోనీ వాగ్వాదంకు దిగాడు. చివరికి పతిరాణా 16వ ఓవర్‌ వేశాడు. ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం ఓ ఆటగాడు మ్యాచ్ జరిగే సమయంలో 8 నిమిషాలకు పైగా మైదానంలో లేకపోతే అతనిపై నిబంధనలు తీసుకునే అవకాశం అంపైర్లకు ఉంది. 


Also Read: Simple One Electric Scooter: సింపుల్‌ వన్‌ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!


Also Read: IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.