MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీ రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా?
Suresh Raina Gives Clarity on MS Dhoni IPL Retirement. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సురేశ్ రైనా స్పందించాడు. ఇటీవల ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని ఓ జాతీయ ఛానల్‌తో చెప్పాడు.
Suresh Raina Gives Clarity on MS Dhoni IPL Retirement: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచులలో 6 విజయాలు, 4 ఓటములతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన 3 మ్యాచులలో 2 గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. గతేడాది ప్లే ఆఫ్స్ కూడా చేరని చెన్నై.. ఈసారి అద్భుత ఆటతో ముందుకు సాగుతోంది. 16 సీజన్‌లో చెన్నై ఆట తీరుపై ఎంత చర్చ జరుగుతోందో.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై కూడా అంతకంటే ఎక్కువ చర్చ కొనసాగుతోంది. గత 2 ఏళ్లుగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి వార్తలపై ధోనీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సురేశ్ రైనా స్పందించాడు. ఇటీవల ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని ఓ జాతీయ ఛానల్‌తో చెప్పాడు. 'ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా నేను మరో ఏడాది ఆడతాను' అని ధోనీ తనతో అన్నాడని రైనా చెప్పాడు. రైనా మాటలను బట్టి మహీ ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ఈ ఏడాది చెన్నై టైటిల్ గెలిచినా.. 2024 కూడా ఆడతాడు. ఈ వార్త నిజమైతే ధోనీ అభిమానులకు ఇది శుభవార్త అవుతుంది. ఎందుకంటే ధోనీ లేని చెన్నై జట్టును ఫాన్స్ ఊహించుకోలేకపోతున్నారు.
ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో ఐపీఎల్ 2023 కామెంటేటర్ డానీ మారిసన్..ఎంఎస్ ధోనీతో మాట్లాడాడు. ‘మీ ఐపీఎల్ చివరి సీజన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు’ అని అడగ్గా.. 'అది మీరే డిసైడ్ చేశారు కదా' అని ధోనీ నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు. ఆ వెంటనే డానీ మారిసన్ మాట్లాడుతూ.. 'ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు’ అని చెప్పాడు. డానీ అలా అనగానే చెన్నై ఫాన్స్ ఆనందనంతో కేరింతలు కొట్టారు. స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మార్మోగింది.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ సారద్యంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుత సీజన్‌లోనే ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతూనే జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను అందించి ముంబై ఇండియన్స్ జట్టుతో సమంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా సీఎస్‌కేను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో చెన్నై ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. చెన్నై ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. మరో 2 మ్యాచులు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
Also Read: Nitish Rana Fine: విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.