Nitish Rana Fine: విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్!
KKR Captain Nitish Rana Gets Fine Of 12 Lakh for slow over-rate. విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు జరిమానా పడింది.
KKR Captain Nitish Rana Gets Fine Of 12 Lakh for slow over-rate: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.చివరి బంతికి రింకు సింగ్ ఫోర్ బాదడంతో అనూహ్య విజయం సాధించిన కోల్‌కతా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. 18వ ఓవర్ వరకు మ్యాచ్ పంజాబ్ చేతిలో ఉన్నా.. ఆండ్రీ రసెల్ మూడు సిక్సులు బాదడంతో మ్యాచ్ కోల్‌కతా చేతుల్లోకి వచ్చింది. 20వ ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత ఆందోళన చెందిన కోల్‌కతా.. రింకూ సింగ్ బౌండరీతో ఊపిరి పీల్చుకుంది. మొత్తానికి ఊహించని విజయంతో కోల్‌కతా సంబరాలు చేసుకుంది.
విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు రాణాకు రూ. 12 లక్షల జరిమానాని ఐపీఎల్ అధికారులు విధించారు. ఈ సీజన్లో తొలిసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు కేవలం ఫైన్‌తో సరిపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడోసారి కూడా ఇదే రిపీట్ అయితే ఓ మ్యాచ్ నిషేధం పడనుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57; 47 బంతుల్లో 9 ఫోర్లు,సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. షారుక్ ఖాన్ (21 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) చెలరేగాడు. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆఖరి బంతికి 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేసన్ రాయ్ (38; 24 బంతుల్లో 8 ఫోర్లు), నితీశ్ రాణా (51; 38 బంతుల్లో ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ ( 42; 23 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (21 నాటౌట్; 10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) చెలరేగారు.
ఈ విజయంతో 2023 ప్లే ఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచులలో 5 విజయాలు అందుకుంది. పది పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పట్టికలో కోల్‌కతాతో పాటు రాజస్థాన్, ముంబై, బెంగళూరు, పంజాబ్ జట్ల వద్ద పది పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా కోల్‌కతా ఐదో స్థానానికి చేరింది. దాంతో ఇక నుంచి అన్ని జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే కానుంది. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుంది. గుజరాత్, చెన్నై, లక్నో జట్లు టాప్-3లో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.