PBKS vs KKR: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ శుభారంభం!
Punjab Kings beat Kolkata Knight Riders by 7 runs as per DLS method. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
Punjab Kings beat Kolkata Knight Riders by 7 runs as per DLS method: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం సాయంత్రం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. 16 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అనంతరం భారీ వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మసీత్ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌ను విజేతగా నిలిచింది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్ (2), అనుకుల్ రాయ్ (4) పెవిలియన్ చేరారు. రెహ్మనుల్లా గర్భాజ్ (22)ను నాథన్ ఎల్లిస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో నితీశ్ రాణా (24), వెంకటేశ్ అయ్యర్ (34) జట్టును ఆదుకున్నారు. రాణా, రింకూ సింగ్ ఔట్ కాగా.. ఆండ్రూ రస్సెల్ (35; 19 బంతుల్లో)కీలక పరుగులు చేశారు. 146 పరుగుల వద్ద వర్షం కురవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్స్ పడగొట్టగా.. సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, సికిందర్ రజా, రాహుల్ చహర్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ (29 బంతుల్లో 6 ఫోర్లతో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జితేశ్ శర్మ (21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23) ఫర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్ చివర్లో సామ్ కరన్ (26; 17 బంతుల్లో) ధాటిగా ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
Also Read: Shikhar Dhawan IPL Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేసిన శిఖర్ ధావన్!
Also Read: Balakrishna Kohli Dialogue: అమ్మో విరాట్ కోహ్లీనా.. ఫైర్ బ్రాండ్! నందమూరి బాలకృష్ణ నోట ఫన్నీ డైలాగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.