PBKS vs LSG Dream11 Team Prediction: పంజాబ్ vs లక్నో.. డ్రీమ్ 11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్
Punjab Kings vs Lucknow Super Giants IPL 2023 Match No 38 Dream11 Prediction. ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడునున్నాయి.
LSG vs PBKS IPL 2023 Match No 38 Dream11 Prediction: ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం 38వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడునున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2023లో పంజాబ్, లక్నో తలపడడం ఇది రెండోసారి. చెరో 7 మ్యాచులు ఆడిన ఇరు జట్లు నాలుగు విజయాలతో 8 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు పది పాయింట్లతో పట్టికలో ముందుకు దూసుకెళుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో మ్యాచులు ఆడకున్నా.. సామ్ కరన్ అద్భుతంగా జట్టుని నడిపిస్తున్నాడు. లియామ్ లివింగ్ స్టోన్ రాకతో బ్యాటింగ్ బలంగా మారింది. మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ రాణిస్తున్నారు. ఇక సామ్ కరన్ అయితే దంచికొడుతున్నాడు. పేసర్ అర్షదీప్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడి బుల్లెట్ బంతులకు వికెట్లే విరిగిపోయాయి. సామ్ కరన్, నేథన్ ఇల్లిస్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ బ్రార్ ఆకట్టుకుంటున్నారు.
భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉన్నా.. వేగంగా ఆడలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతున్న కైల్ మేయర్స్ స్థానంలో క్వింటన్ డికాక్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్ బ్యాట్ జులిపించాల్సి ఉంది. లక్నో బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. మార్క్‌వుడ్, నవీనుల్ హఖ్, యుధ్‌వీర్, అవేశ్ ఖాన్ సత్తాచాటుతున్నారు. స్టాయినిస్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా ఫామ్ కలిసొచ్చే అంశం.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.
PBKS vs LSG Playing XI:
పంజాబ్ కింగ్స్: అథర్వ తైదే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (కీపర్), ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, నవీన్-ఉల్-హక్.
PBKS vs LSG Today Dream11 Team:
వికెట్ కీపర్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్
బ్యాటర్లు: అథర్వ తైదే, హర్‌ప్రీత్ సింగ్, కేఎల్ రాహుల్
ఆల్ రౌండర్లు: సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, అమిత్ మిశ్రా
కెప్టెన్: సామ్ కరన్
వైస్ కెప్టెన్: కేఎల్ రాహుల్
Also Read: Shukra Ki Mahadasha 2023: శుక్ర మహాదశ 2023.. 20 సంవత్సరాలు రాజు జీవితం! ఊహించని సంపద, కీర్తి
Also Read: Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమ నాడు అరుదైన యాదృచ్చికం.. ఈ 4 రాశుల వారికి ఊహించని డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.