RCB vs CSK Dream11 Prediction: ఐపీఎల్‌ 2023లో సోమవారం కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని ఎమ్. చిన్నస్వామి స్టేడియం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలో గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరి మ్యాచ్‌ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్‌ జోష్‌లో ఉంది. అటు ముంబై చేతిలో ఓడిపోయిన చెన్నై.. ఈ మ్యాచ్‌లో గెలిచి విక్టరీ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.


RCB vs CSK పిచ్ రిపోర్ట్ (Dream11 Prediction):


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎం.చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో బ్యాట్స్‌మెన్స్‌ ఎక్కువ పరుగులు చేసే ఛాన్స్ ఉంది. ఈ పిచ్‌పై ఎక్కువ ఛేజింగ్ చేసిన టీమ్‌నే విజయం వరించింది. ఈ గ్రౌండ్‌లో మూడు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 170కి పైగా పరుగులు చేసింది. ఈ స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌లకు అభిమానులు హైస్కోరింగ్ గేమ్‌ను చూసి ఎంజాయ్ చేయబోతున్నారున.


మ్యాచ్ వివరాలు ఇలా..
తేదీ: 17 ఏప్రిల్, సోమవారం
వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
ప్రారంభ సమయం: రాత్రి 7.30


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వైశాక్ విజయ్ కుమార్.


చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాష్ సింగ్.


డ్రీమ్‌ 11 టీమ్:
డేవాన్ కాన్వే (వికెట్ కీపర్), ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్ ), మహ్మద్ సిరాజ్,  వైశాక్ విజయ్ కుమార్, వేన్ పార్నెల్, తుషార్ దేశ్‌పాండే.


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.