Royal Challengers Bangalore Vs Gujarat Titans Dream 11 Team Tips: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ భవితవ్యం నేడు తేలిపోనుంది. గుజరాత్, చెన్నై, లక్నో జట్లు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ముంబై, రాజస్థాన్, బెంగుళూరు జట్లు రేసులో ఉన్నాయి. వీటిలో ఆర్‌సీబీకే అన్నికంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో నేడు జరిగే ఫైట్‌లో నెగ్గితే.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. పిచ్ రిపోర్టు, హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి..? డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కేయండి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


బెంగళూరు జట్టు సొంత మైదానం ఎం.చిన్నస్వామి స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. బౌండరీల లైన్లు చిన్నవిగా ఉండడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్టే అత్యధికసార్లు విజయం సాధించింది. ఇక్కడ ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 37 సార్లు గెలుపొంది. ఛేజింగ్ చేసిన జట్టు 46 సార్లు విజయం సాధించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండడంతో హైస్కోరింగ్‌ గేమ్‌గా సాగనుంది. 


హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..


ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఒక మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగా.. మరో మ్యాచ్‌లో ఆర్‌బీసీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇరు జట్లు సమానంగా ఉండడంతో గెలుపు ఎవరిదో అంచనా వేయడం కష్టం. సొంతగడ్డపై ఆడుతుండడం.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ కావడంతో ఆర్‌సీబీకి కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 


తుది జట్లు ఇలా.. (అంచనా)


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, మైకేల్ బ్రేస్‌వెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, వేన్ పార్నెల్.


గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.


డ్రీమ్ 11 టీమ్ టిప్స్..


వికెట్ కీపర్: వృద్ధిమాన్ సాహా
బ్యాట్స్‌మెన్లు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్ 
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్
బౌలర్లు: రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్


Also Read: Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి