Royal Challengers Bangalore Vs  Kolkata Knight Riders Playing 11: కోల్‌కోతా నైట్‌రైడర్స్ కీలక సమరానికి సిద్ధమవుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో కేకేఆర్.. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ గెలివాల్సి ఉంటుంది. నేడు బెంగుళూరు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడుతోంది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఇందులో ఒక మ్యాచ్‌ను శార్దుల్ ఠాకూర్ గెలిపిస్తే.. మరో మ్యాచ్‌ను రింకూ సింగ్ గెలిపించాడు. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో జట్టుగా ఆడడంలో విఫలమైంది. అటు ఆర్‌సీబీ 7 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్‌-3కి చేరుకుంటుంది. కేకేఆర్ పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడోస్థానంలో ఉంది. బెంగుళురు చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..


హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. కోల్‌కతాదే పైచేయిగా ఉంది. ఆర్‌సీబీ, కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా 18, బెంగుళూరు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో ఆర్‌సీబీపై గెలుపొందింది. అయితే వరుస ఓటములతో కోల్‌కతా డీలా పడిపోయింది. బలమైన ఆర్‌సీబీని దాని సొంతగడ్డపై ఓడించడం కాస్త కష్టమే కావొచ్చు. ఈ మ్యాచ్‌లో బెంగుళూరుదే పైచేయిగా నిలిచే అవకాశం ఉంది. 


పిచ్ రిపోర్ట్ ఇలా..


చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. బౌండరీ లైన్లు చిన్నవిగా ఉండడంతో సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లే నమోదయ్యాయి. నేటి మ్యాచ్‌లో కూడా మరోసారి హైస్కోరింగ్ గేమ్‌గా జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లు కొంచెం స్వింగ్‌తో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేయడం ఈజీ. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఛాన్స్ ఉంది.


Also Read: IPL Latest Updates: కమ్‌బ్యాక్ కింగ్స్.. ఈ సీజన్‌లో రెచ్చిపోతున్న సీనియర్ ప్లేయర్లు..!


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్.


కేకేఆర్: జేసన్ రాయ్, ఎన్.జగదీషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, ఉమేష్ యాదవ్, కుల్వంత్ ఖేజ్రోలియా, వరుణ్ చక్రవర్తి.


Also Read: User Charges Hike: సైలెంట్‌గా షాకిచ్చిన ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook