RCB Vs LSG: బెంగళూరుదే బ్యాటింగ్.. ఈ మార్పులతో బరిలోకి ఇరు జట్లు!
Lucknow Super Giants won the toss and have opted to field: మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి.
Royal Challengers Bangalore Vs Lucknow Super Giants 15th Match Playing11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల కెప్టెన్స్ మార్పులు చేశారు.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు లక్నో 3 మ్యాచులు ఆడి.. రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు 2 మ్యాచుల్లో ఒకటి గెలిచి.. మరో మ్యాచులో పరాజయం పాలైంది. రెండు జట్లు తలపడిన గత ప్రదర్శనను చూస్తే.. బెంగళూరుదే పైచేయిగా ఉంది. అయితే బెంగళూరుపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచులో సత్తా చాటితే.. ఫాఫ్ సేనకు కష్టాలు అతప్పకపోవచ్చు. ఇరు జట్లలో స్టార్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ (RCB vs LSG IPL 2023 Live Score Updates) రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
తుది జట్లు:
బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, పార్నెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.
లక్నో: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, జయ్‌దేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.