Wayne Parnell IPL 2023: సొంతగడ్డపై కీలక పోరుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బిగ్‌ ఫైట్‌కు రెడీ అయింది. ఆడిన రెండు మ్యాచ్‌లో ఒక దాంట్లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయింది. లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లో రెండు విజయాలు సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రెండు జట్లు కూడా ప్లేయిగ్‌లో 11లో కీలక మార్పులతో బరిలోకి దిగాయి. రెండు మ్యాచ్‌ల్లోనే 8 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తిరిగి లక్నో జట్టుతో చేరాడు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్ బౌలర్‌ వేన్ పార్నెల్‌ను కూడా ఆర్‌సీబీ తుది జట్టులోకి తీసుకుంది. తొమ్మిదేళ్ల తరువాత ఈ స్పీడ్‌స్టార్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తన చివరి ఐపీఎల్ 2014లో ఆడాడు. ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా  ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో టాప్లీకి బదులుగా వేన్ పార్నెల్‌ను జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్నోతో జరుగుతన్న మ్యాచ్‌లో వేన్ పార్నెల్‌కు తుది చోటు కల్పించింది. దీంతో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించింది. 


గతేడాది జరిగిన మినీ వేలంలో పార్నెల్ బేస్ ధర రూ.75 లక్షలు కాగా.. ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్టార్‌ బౌలర్‌గా పేరు పొందిన పార్నెల్.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. అయితే 26 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. మళ్లీ 2021లో తన రిటైర్మ్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చివరి నిమిషంలో అదృష్టం వరించి.. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. స్పీడ్‌ సత్తా నిరూపించుకుంటే ఆర్‌సీబీకి బౌలింగ్ కష్టాలు పూర్తిగా తీరినట్లే.  


Also Read: RCB vs LSG: బెంగళూరుదే బ్యాటింగ్.. మార్పులతో బరిలోకి ఇరు జట్లు!


ప్లేయింగ్ 11 ఇలా..


లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.


బెంగుళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. 


Also Read: IPL 2023 Points Table: అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున ఢిల్లీ క్యాపిటల్స్! ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook