Rohit Sharma Spoke Telugu: అభిమానులారా పదండి ఉప్పల్‌కి.. తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ! వైరల్ వీడియో
Rohit Sharma Spoke in Telugu ahead of SRH vs MI in Uppal. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫ్లయిట్ దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Rohit Sharma talks in Telugu ahead of SRH vs MI IPL 2023 25th Match in Uppal Stadium: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. సన్‌రైజర్స్ సొంత మైదానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. మూడో మ్యాచులో విజయం సాధించింది. నేడు మరో విజయం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వరుసగా రెండు విజయాలు సాధించిన ముంబై కూడా మరో విజయంపై కన్నేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు (SRH vs MI) సోమవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫ్లయిట్ దిగిన రోహిత్.. తెలుగులో (Rohit Sharma Telugu) మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'మేము వచ్చేసినాము.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పదండి ఉప్పల్‌కు' అని ముంబై కెప్టెన్ రోహిత్ అన్నాడు. ఇందుకు సంబందించిన వీడియోను ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్ వచ్చేశాడు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు బాష, రోహిత్ శర్మకు విడదీయరాని అనుబందం ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ తల్లి పూర్ణిమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించారు. దాంతో రోహిత్‌కు తెలుగు అర్ధం అవుతుంది. అంతేకాదు కొంచెం కొంచెం మాట్లాడుతాడు కూడా. మరోవైపు రోహిత్ తన ఐపీఎల్ కెరీర్‌ను అప్పటి డెక్కన్ చార్జర్స్‌తో ప్రారంభించాడు. దాంతో ఉప్పల్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం కూడా హిట్‌మ్యాన్ రోహిత్‌కు ఉంది. చాలా సందర్భాల్లో హైదరాబాద్ అంటే తనకు చాలా చాలా ఇష్టం అని రోహిత్ చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఇప్పటినుంచే మైదానం వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా తమ ఫేవరేట్ క్రికెటర్ రోహిత్ శర్మను చూడ్డానికి ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. స్వయంగా రోహిత్ తెలుగులో మాట్లాడడంతో ఫాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు. అభిమానుల రాకతో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటినుంచే గేట్స్ వద్ద క్యూ కట్టారు. సన్‌రైజర్స్, ముంబై ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.