Joe Root Helicopter Shot: ధోని స్టైల్లో హెలికాఫ్టర్ షాట్ ఆడిన జో రూట్.. బాల్ ఎక్కడ పడిందంటే..!
RR vs LSG Match Updates: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా రూట్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. నేడు లక్నో జట్టుతో జరిగే మ్యాచ్‌లో రూట్‌ను తీసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌లో రూట్ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
RR vs LSG Match Updates: ఐపీఎల్‌లో రసవత్తర మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఢిల్లీ డేర్‌డేవిల్స్ మినహా అన్ని జట్లు పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు విజయాలతో ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. నేడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించి.. ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు పోవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌కు ఫుల్ జోష్‌లో సిద్ధమైంది. అయితే ఆ జట్టు మిడిల్ ఆర్డర్ కాస్త ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో జో రూట్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలోనే జో రూట్ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని తరహాలో హెలికాఫ్టర్ షాట్ సిక్సర్ కొట్టాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ టీమ్ షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 4 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. గతేడాది జరిగిన మినీ వేలంలో ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ను రూ.కోటికి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇప్పటివరకు రాజస్థాన్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కదాంట్లో కూడా జోరూట్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు నేడు జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు.
గతేడాది రన్నప్‌గా నిలిచిన రాజస్థాన్ ఈసారి ఎలాగైన కప్ కొట్టాలని లక్ష్యంతో ఆడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించింది. 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా.. అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 72 పరుగులతో.. ఢిల్లీపై 57, చెన్నైపై 3 రన్స్, గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపొంది జోరు మీద ఉంది.
Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!
పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మొదట్లో మెరిసిన ఓపెనర్ కైల్ మేయర్స్.. మళ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉండడంతో పాటు బౌలింగ్‌లో మార్క్ వుడ్, అమిత్ మిశ్రా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి