SRH vs LSG match was stopped for 10 minutes due to fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా ప్రస్తుతం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఫ్యాన్స్ కారణంగా కాసేపు ఆగింది. సన్‌రైజర్స్‌ ఫాన్స్.. లక్నో డగౌట్ వద్ద రచ్చ రచ్చ చేశారు. కొందరు అభిమానులు నట్లు, బోల్టులు విసిరేయడంతో డగౌట్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫాన్స్ అతిచేష్టల కారణంగా మ్యాచ్ దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా 19వ ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదవ బంతిని అవేశ్ ఫుల్‌ టాస్‌ వేశాడు. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌ ఇచ్చాడు. ఈ అంపైర్‌ కాల్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ చాలెంజ్‌ చేసింది. అల్ట్రా ఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. నో బాల్‌ కాదని (బంతి సమద్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకడంతో) ఇచ్చాడు. దీంతో క్లాసెన్‌ సహా అబ్దుల్‌ సమద్‌ షాక్‌కు గురయ్యారు. క్లియర్‌గా నోబాల్‌ అని కనిపిస్తున్నా.. థర్డ్‌ అంపైర్‌ కరెక్ట్‌ బాల్‌గా ఇవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 


థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో అసహనానికి గురైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాన్స్.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ డగౌట్‌ వైపు నట్స్‌, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి డగౌట్‌లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్‌ వైపుగా వచ్చారు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్‌, క్వింటన్‌ డికాక్‌లు నోబాల్‌ వ్యవహారంపై చర్చించారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన అంపైర్లు కలగజేసుకొని డగౌట్‌ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దాంతో మ్యాచుకు కాసేపు అంతరాయం కలిగింది. దాదాపుగా ఓ 10 నిముషాలు మ్యాచ్ ఆగిపోయింది. అదే సమయంలో గౌతమ్ గంభీర్ కనిపించగానే.. ఫాన్స్ అందరూ 'కోహ్లీ కోహ్లీ' అని గట్టిగా అరిచారు. దాంతో గౌతీ కాస్త అసహనానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



లక్ని సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరాడే స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్ (47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్ (36; 27 బంతుల్లో 7 ఫోర్లు), అబ్దుల్ సమద్ (37; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌ (0) నిరాశపర్చగా.. రాహుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్ (28) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య 2 వికెట్స్ పడగొట్టగా. యుధ్విర్‌ సింగ్, అవేశ్ ఖాన్‌, యశ్‌ ఠాకూర్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.


Also Read: Lava Agni 2 5G Launch: లావా అగ్ని 2 లాంచ్ డేట్ వచ్చేసింది.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!  


Also Read: SRH vs LSG: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌.. జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్‌! తుది జట్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.