SRH vs LSG: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. రెండో ఆటగాడిగా రికార్డు! టాప్‌లో సునీల్ నరైన్
Nicholas Pooran Hits 3 sixes in First Three Balls. ఐపీఎల్‌లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా నికోలస్ పూరన్ రికార్డుల్లోకి ఎక్కాడు.
Nicholas Pooran Hits 3 sixes in First Three Balls: శనివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (47), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్స్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ప్రేరక్ మన్కడ్ (64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. నికోలస్ పూరన్ (44) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. మార్కస్ స్టొయినిస్ (40) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మార్కండే, అభిషేక్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అభిషేక్ శర్మ 17 ఓవర్ వేయగా.. పూరన్ వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. కేవలం 13 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 సిక్సర్లు, 3 ఫోర్లుతో 44 పరుగులు చేశాడు. పూరన్ చెలరేగడంతో లక్నో మరో నాలుగు బంతులు ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్‌లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా నికోలస్ పూరన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఈ ఫీట్ అందుకున్నాడు. బెంగళూరు బౌలర్ డ్యానియల్ క్రిస్టయన్ బౌలింగ్‌లో వరుసగా తాను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను నరైన్ సిక్సర్లగా మలిచాడు.
Also Read: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌కు జరిమానా.. అసలు కారణం ఏంటంటే?
Also Read: 2023 Cheapest Car in india: 5 లక్షల బడ్జెట్‌లో 4 బెస్ట్ కార్లు.. మైలేజ్ 32 కిలోమీటర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.