Sunrisers Hyderabad vs Mumbai Indians 25th Match IPL 2023 Pitch Report and Preview: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్, ముంబై జట్లు చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లూ తమ తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడి తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక నేడు ఉప్పల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా.. ఆ టీంకు హ్యాట్రిక్‌ విజయం అవుతుంది. మరి ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతాపై సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్ అదే ప్రదర్శనను కొనసాగించాలని హైదరాబాద్‌ యాజమాన్యం ఆశిస్తోంది. కెప్టెన్‌ ఐడెన్ మార్‌క్రమ్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్ శర్మ, మయాంక్‌ అగర్వాల్, వాషింగ్టన్‌ సుందర్ రాణిస్తే.. హైదరాబాద్‌కు తిరుగుండదు. ఉమ్రాన్‌ మాలిక్, టీ నటరాజన్‌, మార్కో జాన్‌సెన్‌, భువనేశ్వర్ కుమార్ చెలరేగితే.. ముంబై బ్యాటర్ల దూకుడును అడ్డుకోవచ్చు. 


ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు చేస్తుండడం ఆ జట్టుకి శుభసూచికం. ఇషాన్‌ కిషన్ కూడా బ్యాట్ జుళిపిస్తే మంచి ఆరంభం దక్కుతుంది. సూర్యకుమార్‌ యాదవ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. తిలక్‌ వర్మ, కామెరూన్ గ్రీన్, టిమ్‌ డేవిడ్‌ రాణిస్తే పరుగుల వరద పారుతుంది. జోఫ్రా ఆర్చర్, అర్జున్ తెందూల్కర్, డ్యూన్ జాన్‌సెన్, హృతీక్ షోకీన్‌, పీయూష్ చావ్లాలు బాగా బౌలింగ్ చేస్తున్నారు. 


హైదరాబాద్‌ నగరంలో ఈ రోజు పూర్తిగా ఎండ కాసింది. దాంతో మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు. వేడి వాతావరణం వల్ల ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మైదానంలో జరిగిన రెండు మ్యాచుల్లో పిచ్‌ మిశ్రమంగా స్పందించింది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు (203/5) నమోదు కాగా.. రెండో మ్యాచ్‌లో 143/9 స్కోరు నమోదైంది. 


హైదరాబాద్‌, ముంబై జట్లు19 మ్యాచుల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో ముంబై 10 మ్యాచులు గెలవగా.. హైదరాబాద్‌ 9 మ్యాచుల్లో గెలిచింది. హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 193 పరుగులు కాగా..  ముంబై 235 పరుగుల అత్యధిక స్కోరును సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌ అత్యల్ప స్కోరు 96 పరుగులు కాగా.. ముంబై స్కోర్ 87. ఐపీఎల్ 2022లో ముంబైపై హైదరాబాద్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 


Also Read: Trisha Krishnan Pics: వయసు పెరుగుతున్నా.. అందం మాత్రం ఇసుమంత కూడా తగ్గట్లేదు! త్రిష బ్యూటిఫుల్ పిక్స్  
Also Read: IPL 2023 Retirement: ఐపీఎల్‌ 2023 అనంతరం రిటైర్మెంట్‌ ఇచ్చే 5 ప్లేయర్స్ వీళ్లే.. ముందువరుసలో ఎంఎస్ ధోనీ!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.