SRH vs RCB IPL 2023 Match 65 Live Score Updates: ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌లో మ్యాచ్‌ జరుగుతుండగా.. టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తాను ఎలాంటి మార్పులు చేయలేదని డుప్లెసిస్ చెప్పాడు. మరోవైపు సన్‌రైజర్స్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతోందని కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ చెప్పాడు. హ్యారీ బ్రూక్, కార్తీక్ త్యాగి తుది జట్టులోకి వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు చాలా ముఖ్యమైంది. ఫాఫ్ సేనది చావోరేవో పరిస్థితి. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్. మరోవైపు సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పరువు కోసం పోరాడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్‌ గెలుపుతో టోర్నీ ముగించాలని చూస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.


తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మైఖేల్ బ్రాస్‌వెల్, పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్‌), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ దాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి.


ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దినేశ్‌ కార్తిక్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, హిమాన్షు శర్మ, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, కేదార్‌ జాదవ్‌.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్‌ మార్కండే, నటరాజన్, వివ్రాంత్ శర్మ, సన్వీర్‌ సింగ్, అకిలా హొస్సేన్‌.


డ్రీమ్11 టీమ్:
కీపర్ - హెన్రిచ్ క్లాసెన్, అనుజ్ రావత్
బ్యాట్స్‌మెన్ - విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు - గ్లెన్ మాక్స్‌వెల్ (వైస్ కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, ఐడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్
బౌలర్లు - వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్


Also Read: BRO Movie: ఆసక్తికరంగా పవన్‌ కల్యాణ్‌-సాయి తేజ్‌ మూవీ టైటిల్‌.. స్టైలిష్‌ లుక్‌లో పవర్‌స్టార్‌!   


Also Read: Realme Narzo N53 Launch: బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసిన రియల్‌మీ.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ! 30 నిమిషాల్లో ఛార్జింగ్‌  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.