Suryakumar Yadav 1st Tattoo: నా ఫస్ట్ టాటూ అదే.. అసలు విషయం చెప్పేసిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav talks about his Tattoos. టాటూలు వేయించుకోవాలని ఎందుకు అనిపించింది?, తాను వేయించుకున్న తొలి టాటూ ఏంటో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
Suryakumar Yadav talks about his Tattoos: టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు టాటూలు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య శరీరం చూస్తే ఇది ఇట్టే అర్ధమయిపోతుంది. కాళ్లు, చేతులు, మెడ, వీపు, ఛాతి భాగాల్లో ఎక్కడ చూసినా టాటూలే ఉంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ టాటూలు సూర్యకుమార్‌కే ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సూర్యకు టాటూలు వేసుకోవడానికి మొహం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే ఇన్ని టాటూలు తన ఫామిలీ అనుమతితోనే వేసుకున్నాడట.
ప్రస్తుతం ఐపీఎల్ 2023లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్.. తాజాగా 'జియో సినిమా'తో మాట్లాడాడు. ఈ సందర్భంగా సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టాటూలు వేయించుకోవాలని ఎందుకు అనిపించింది?, తాను వేయించుకున్న తొలి టాటూ ఏంటో సూర్య తెలిపాడు. 'నేను నా ముంజేతిపై తొలిసారి టాటూ వేయించుకున్నా. ఆ టాటూ చూడ్డానికి చాలా బాగా కనిపించింది. దాంతో నా శరీరంపై చాలా టాటూలు వేయించుకోవాలనుకున్నా. నేను మొదటిసారి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినపుడు అక్కడ చాలామంది టాటూలు వేసుకోవడం చూశా. మా అమ్మానాన్నల అనుమతి తీసుకొని టాటూ వేయించుకున్నా. వాళ్ల పేరునే తొలి టాటూగా వేయించుకున్నా' అని సూర్యకుమార్ చెప్పాడు.
'తొలి టాటూ తర్వాత ఇక టాటూలు వేయించుకునే ప్రక్రియ ఆగలేదు. ఆ తర్వాత నాకు పెళ్లైంది. అప్పుడు నా భార్య అనుమతి కూడా తీసుకోవాల్సి వచ్చింది. నా భార్య పేరును ఛాతిపై టాటూగా వేయించుకున్నా. ఆ తర్వాత మరిన్ని టాటూలకు అనుమతి లభించింది. ఆ తర్వాత టాటూలు వేయించుకుంటూ వెళ్లాను. ఇప్పుడు నా శరీరంపై ఖాళీ ఎక్కడ ఉందా? అని చూస్తున్నా. నా సతీమణి ఈ టాటూల విషయంలో నన్ను ఆటాడుకుంటుంది. 'మొహం, నుదురు, మెడపై కూడా టాటూలు వేయించుకో అని నా భార్య సరదాగా అంటూ ఉంటుంది'. అయితే ముఖంపై మాత్రం టాటూలు వేయించుకోలేం. కానీ కొందరు అక్కడ కూడా వేసుకున్న వాళ్లను చూశా. వాళ్లకు టాటూలు అంటే పిచ్చి కావొచ్చు' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2023లో సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినా.. ఇప్పుడు పుంజుకున్నాడు. నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో సూర్య చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచుకు ముందు ముంబైకి గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2023లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో స్వదేశానికి పయనమయ్యాడు. ఆర్చర్ స్థానంలో మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Also Read: MI vs RCB: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ బౌలర్ దూరం! స్వదేశంకు ప్రయాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.