GT Vs KKR Dream11 Team Prediction: సండే అంటే ఫండే.. ఈ ఫండేను మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చనుంది ఐపీఎల్‌. నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌లో రెండు విజయాలతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా.. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో కేకేఆర్ రంగంలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


అహ్మదాబాద్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌పై కొంచెం బౌన్స్ ఉండడంతో ఫాస్ట్ బౌలర్లకు కూడా కొంత సహాకారం అందుతుంది. ఈ గ్రౌండ్‌లో బౌండరీలు కాస్త పెద్దవి కావడంతో సిక్స్‌లు కొట్టడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఎక్కువసార్లు ఛేజింగ్ చేసి జట్లే విజయం సాధించడంతో మరోసారి టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపవచ్చు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫస్ట్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 178 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ ఈజీగా టార్గెట్ ఛేదించింది. 


ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ విన్ అయిన గుజరాత్.. ఈసారి కూడా ఛాంపియన్‌గా ఆడుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జట్టు సమతూకంతో ఉంది. ఆటగాళ్లందరూ కూడా ఫామ్‌లో కనిపిస్తున్నారు. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ స్టార్ ఆల్‌రౌండర్లతో బలంగా ఉంది. 


Also Read: MI vs CSK Highlights: ముంబై ఓటమికి కారణాలు ఇవే.. ఇలా అయితే అన్ని మ్యాచ్‌లు దేవుడికే ఇవ్వాలి రోహిత్ భయ్యా..!   


మరోవైపు కోల్‌కతా జట్టులో నమ్మకమైన బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మంచి ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్‌ అద్భుతంగా ఆడడంతో కేకేఆర్ గట్టేక్కింది గానీ.. లేకపోతే తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. 


కేకేఆర్ స్పిన్ విభాగంలో చాలా పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాష్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్‌సీబీని తక్కువ స్కోరుకే కట్టడిచేశారు. ఆండ్రీ రస్సెల్, కెప్టెన్ నితీష్ రాణా, మన్‌దీప్ సింగ్ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా, గుజరాత్ జట్ల మధ్య ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. గత సీజన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 8 పరుగుల తేడాతో కోల్‌కతాపై విక్టరీ సాధించింది.


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహ్మద్ షమీ, జోష్ లిటిల్.


కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, నారాయణ్ జగదీషన్, మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.


డ్రీమ్ 11 టీమ్ (GT Vs KKR Dream11 Team): రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, జోష్ లిటిల్.


Also Read: David Warner Not Out: యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టినా.. డేవిడ్ వార్నర్‌కి ఔట్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి