Virat Kohli, Sourav Ganguly: గంగూలీని కొరకొర చూసిన కోహ్లీ.. షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకున్నాడా ? వీడియో వైరల్
Virat Kohli`s Attitude Towards Sourav Ganguly: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఒక క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్చున్న స్టాండ్స్ కి సమీపంగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ క్యాచ్ పట్టిన అనంతరం సౌరవ్ గంగూలీపై తన కోపాన్ని వెళ్లగక్కుతూ కొరకొర చూశాడంటూ ఇంకొన్ని ఫోటోలు, మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
Virat Kohli's Attitude Towards Sourav Ganguly: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ కేప్టెన్సీలోని బెంగళూరు జట్టు 23 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా 5వసారి ఓటమిపాలైంది. కాగా మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది షేక్‌హ్యాండ్ చేసుకుని పరస్పరం అభివాదం చేసుకునే సమయంలో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరు జట్ల పరస్పరం షేక్‌హ్యాండ్ చేసుకుంటుండగా.. విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకోకుండా దాటవేయడం అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాన్ని కట్ చేసిన నెటిజెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి, గంగూలీ మధ్య విభేదాలు తలెత్తినట్టు గతంలో ఎన్నో వార్తా కథనాలు చూసిన సంగతి తెలిసిందే. అందుకు కారణం సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బిసిసిఐ ఒత్తిడి మేరకే విరాట్ కోహ్లి భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుండి వైదొలిగాడని.. అప్పట్లో గంగూలీ వైఖరి కోహ్లీని తీవ్రంగా బాధించింది అని పుంకానుపుంకాన్ల కథనాలు వచ్చాయి. అయితే, అప్పుడు సౌరవ్ గంగూలీ తనకు చేసిన అన్యాయం విషయంలో విరాట్ కోహ్లీ ఇప్పటికీ కోపంగా ఉన్నాడని.. అందుకే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్ హోదాలో ఉన్న గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించాడని నెటిజెన్స్ మరోసారి కథనాలు, కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.
అంతేకాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఒక క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్చున్న స్టాండ్స్ కి సమీపంగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ క్యాచ్ పట్టిన అనంతరం సౌరవ్ గంగూలీపై తన కోపాన్ని వెళ్లగక్కుతూ కొరకొర చూశాడంటూ ఇంకొన్ని ఫోటోలు, మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, నెటిజెన్స్ పోస్ట్ చేస్తున్న ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుంటే, సౌరవ్ గంగూలీ పట్ల విరాట్ కోహ్లీ తన యాటిట్యూడ్ చూపించుకున్నాడని కొందరు పోస్టులు పెడుతుండగా.. సౌరవ్ గంగూలీ అభిమానులు సైతం తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. స్టీవా లాంటి స్టార్ ప్లేయర్ నే టాస్ కోసం వెయిట్ చేయించిన సీనియర్ ఆటగాడు సౌరవ్ గంగూలీ. గంగూలీకి యాటిట్యూడ్ చూపించిన విరాట్ కోహ్లీ అని చెబుతున్నారు కానీ ఆ యాటిట్యూడ్ గంగూలీలోనే బోలెడంత ఉంది అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.