Virat Kohli New Tattoo Pics goes Viral Ahead of RCB Unbox: ఐపీఎల్ 2023 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. 2023 మార్చి 31 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ఇక ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు, ముంబై ప్లేయర్స్ ఇప్పటికే సాధన చేస్తున్నారు. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త టాటూతో కనిపించాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆర్‌సీబీ అన్‌బాక్స్' ఈవెంట్ నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్ కోసం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో కోహ్లీ కొత్తగా కనిపించాడు. హెయిర్ స్టైల్ మార్చుకున్న విరాట్.. చేతిపై కొత్త టాటూ (Virat Kohli Tattoo) వేయించుకున్నాడు. కుడి మోచేయి కింద ఉన్న టాటూ కెమెరాలకు చిక్కింది. టాటూ మధ్యలో విచ్చుకున్న పువ్వు డిసైన్ ఉంది. ఈ టాటూ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే కోహ్లీ మాత్రం చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించాడు. కోహ్లీ టాటూకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


'ఆర్‌సీబీ అన్‌బాక్స్' ఈవెంట్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ మొత్తం బెంగళూరు చేరుకున్నారు. వీరితో ఆర్‌సీబీ మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్ కూడా బెంగళూరు వచ్చారు. ఈ కార్యక్రమంలో గేల్, డివిల్లీర్స్ ఇద్దరినీ 'ఆర్‌సీబీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చేరుస్తారు. ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్‌సీబీ నుంచి ఓ ఆసక్తికర ప్రకటన కూడా ఉంటుందని విరాట్ కోహ్లీ హింట్ ఇచ్చాడు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికర ప్రకటన ఏంటో ఈ రోజు రాత్రికి తెలియరానుంది. 



ఆర్‌సీబీ  2023 జట్టు: 
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, వానిందు హసరంగా, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, అవినాష్ సింగ్ కుమార్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోను యాదవ్, మైఖేల్ బ్రేస్‌వెల్. 


Also Read: IPL 2023: ఐపీఎల్ 2023 కామెంటేటర్‎గా హీరో బాలకృష్ణ.. ఇక క్రికెట్ ఫ్యాన్స్‎కు పూనకాలే!


Also Read: Shikhar Dhawan: అప్పుడే భారత జట్టులో నా చోటు పోయిందని ఫిక్స్ అయ్యా: శిఖర్‌ ధావన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి