India beat Ireland in 1st T20I: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం రాత్రి వరుణుడు ప్రభావం చూపిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ దీపక్‌ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్‌ బౌలర్లలో క్రెయిగ్ యంగ్‌ (2/18) ఒక్కడే పర్వాలేదనిపించాడు. రెండో టీ20 మంగళవారం జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు భువనేశ్వర్‌ కుమార్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్ అయిదో బంతికే కెప్టెన్‌ బాల్‌బిర్నీ (0)ని బౌల్డ్‌ అయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో స్టిర్లింగ్‌ (4) ఔట్ అయ్యాడు. డెలానీ (8)ని అవేష్‌ ఖాన్ వెనక్కి పంపడంతో ఐర్లాండ్‌ 22/3తో కష్టాల్లో పడింది. అయితే టెక్టార్‌  (64 నాటౌట్‌; 33 బంతుల్లో 64, 36) భారత బౌలర్లపై ఎదురు దాడి చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. టకర్‌ (18) కూడా అతడికి సహకరించాడు. ఐర్లాండ్‌ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువీ, చహల్ పొదుపుగా బౌలింగ్ చేశారు.


లక్ష్య ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. లిటిల్‌ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా 4, 6, 4 బాదేశాడు. యంగ్‌ వేసిన మూడో ఓవర్లోనూ 4, 6 కొట్టాడు. అయితే నాలుగో బంతికి బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాతి బంతికే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ సమయంలో హార్దిక్‌ పాండ్యా , దీపక్ హుడా ధాటిగా ఆడారు. ఇద్దరు బౌండరీల వర్షం కురిపిస్తూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. అయితే 8వ చివరి బంతికి హార్దిక్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్‌ (5 నాటౌట్‌)తో కలిసి హుడా మిగతా పని పూర్తి చేశాడు.


భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండే. టాస్‌ పడ్డ కాసేపటికే వరుణుడి ప్రతాపం మొదలైంది. దాంతో ఆట సాధ్యం కాలేదు. కాసేపటికి వర్షం ఆగి ఆట ఆరంభమయ్యేలా కనిపించినా.. మరోసారి వరుణుడు పలకరించాడు. చివరికి నిర్ణీత సమయం కంటే 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. దాంతో మ్యాచును 12 ఓవర్లకు కుదించారు. తర్వాత వర్షం అంతరాయం కలిగించలేదు.


Also Read: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వీడిన ఉత్కంఠ..28న ఫలితాలు..!


Also Read: Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి