Ireland bowler Mark Adair bowls 11 balls in an over vs Australia in T20 World Cup 2022: క్రికెట్ ఆటలో బౌలర్ 'వైడ్' వేయడం సాధారణమే. ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లు వైడ్స్ వేస్తుంటారు. అయితే ఒత్తిడి సమయాల్లో ఏ బౌలర్ అయినా వైడ్ బాల్స్ వేస్తుంటాడు. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఓ బౌలర్ ఒక ఓవర్‌లో 2-3కు మించి వైడ్స్ వేయడు. 4-5 వైడ్స్ వేయడం, 10కి మించి బాల్స్ వేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022లో చోటుచేసుకుంది. ఐర్లాండ్ బౌలర్ మార్క్ రిచర్డ్ అడైర్ ఒకే ఓవర్‌లో 11 బంతులు వేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా సోమవారం బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను మార్క్ రిచర్డ్ అడైర్ వేశాడు. ఈ ఓవర్‌లో అడైర్ 11 బంతులు వేశాడు. అడైర్ వేసిన తొలి బంతిని మార్కస్ స్టోయినీస్ బౌండరీ బాదగా.. రెండో బంతిని వైడ్‌గా వేసాడు. రెండో బంతిని స్టోయినిస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద మెక్‌కార్తీ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ పోకుండా ఆపాడు. మూడో బంతిని స్టోయినీస్ బౌండరీ బాది.. నాలుగో బంతికి సింగిల్ తీసాడు. ఆపై అడైర్ వరుసగా మూడు వైడ్లు వేశాడు. 


ఐదో బంతిని ఆరోన్ ఫించ్ బౌండరీ బాదాడు. అనంతరం రిచర్డ్ అడైర్ మరో వైడ్ సంధించాడు. ఇక చివరి బంతిని ఫించ్ సిక్స్‌గా మలిచాడు. 15వ ఓవర్‌లో అడైర్ మొత్తంగా 11 బంతులు వేసి 26 రన్స్ సమర్పించుకున్నాడు. మెక్‌కార్తీ ఫీల్డింగ్‌ కారణంగా ఐర్లాండ్ జట్టుకు 4 రన్స్ సేవ్ అయ్యాయి. లేదంటే అడైర్ 30 పరుగులు ఇవ్వాల్సి రావొచ్చు. అడైర్ చెత్త రికార్డు నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక వైడ్లు వేసిన బౌలర్‌గా, ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన ప్లేయర్‌గా కూడా చెత్త రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. 


ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 180 పరుగులలక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. లోర్కాన్ టక్కర్ (71) ఒక్కడే పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్టార్క్, జంపా, మ్యాక్సీ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఫించ్ (63) అర్ధ సెంచరీ చేశాడు. 


Also Read: నవంబర్‌లో కుజ, బుధ సంచారం.. ఈ ఐదు రాశుల వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!


Also Read: IND vs SA T20 World Cup 2022: టీమిండియా డర్టీ ఫీల్డింగ్.. సఫారీ చేతిలో కావాలనే ఓడిపోయింది.. పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook