ఈ బుడతన్ని చూశారా..? చూడ్డానికి వేలేడంత లేడు కానీ. .  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఢీకొడుతున్నాడు. ఇంతకీ ఈ  చిన్నోడు ఎవరో మీకు తెలుసా..? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ చిన్నోడి పేరు ఇమ్రాన్. పూర్తి పేరు ఇమ్రాన్ పఠాన్. టీమిండియా మాజీ బౌలర్, ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ కుమారుడు. సచిన్ టెండూల్కర్ తో  కలిసినప్పుడు తీసిన సరదా సన్నివేశం ఇది.  17 సెకన్లు ఉన్న ఈ వీడియోను ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. తన కుమారుడుతో ఎవరితో తలపడుతున్నాడో తెలియదని చెప్పుకొచ్చాడు. ఐతే అతడు పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటాడని పేర్కొన్నాడు.



మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ సచిన్ టెండూల్కర్ రీట్వీట్ చేశాడు. చిన్న పిల్లలతో సరదాగా ఆడుకోవడం చాలా బాగుంటుందని తెలిపాడు. అంతే కాదు ఇమ్రాన్ పెద్ద అయిన తర్వాత అతని కండలు బలంగా తయారవుతాయని.. తన కంటే, ఇర్ఫాన్ పఠాన్ కంటే బలంగా తయారవుతాడని ప్రశంసించాడు.



Read Also: 'కరోనా'.. నువ్ నన్ను ఏం చేయలేవ్..!!


ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్, సచిన్ టెండూల్కర్ సహా నిన్నటి తరం క్రికెటర్లంతా రోడ్డు భద్రత కోసం బెనిఫిట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. ముంబైలో జరుగుతున్న టీ-20 సిరీస్  కోసం పలు దేశాల నుంచి నిన్నటి తరం క్రికెటర్లు వచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..