భారత్-విండీస్ రెండో వన్డే: అందరి చూపు కోహ్లీ వైపు ...కోహ్లీ చూపు సచిన్ రికార్డు వైపు
విశాఖ వేదికగా ఈ రోజు జరిగే రెండో వన్డే సమరానికి భారత్ -విండీస్ జట్లు సిద్ధమయ్యాయి. తొలి వన్డేలో బంపర్ విక్టరీ సాధించి ఊపుమీద ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించి విండీస్ మీద పైచేయి సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టుగా గేమ్ ప్లాన్ కోహ్లీ రెడీ చేశాడు. మరోవైపు తొలి వన్డేలో ఓటమిపాలైన విండీస్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని కసితో బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
ఏకపక్షంగా సాగుతున్న ఈ సీరీస్ లో విజయవకాశాలపై పెద్దగా చర్చ కనిపించకపోయినప్పటికీ.. ఈ మ్యాచ్ లో గెలుపు తేడా ఎంతా..ఎవరు ఏ రికార్డు బద్దలు కొడతారు. అన్నవే ఇక్కడ చర్చనీయంశంగా మారింది. ఈ నేప్యథ్యంలో కోహ్లీ రికార్డుపై అందరి దృష్టి మళ్లింది.
విరాట్ కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు. అంతే కాకుండా అంత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలుస్తాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 259 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.ఇప్పటి వరకు 204 మ్యాచ్ లు మాత్రమే ఆడిన కోహ్లీ 9 వేల 919 పరుగులు చేశాడు. విశాఖ మ్యాచ్ లో సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ తిరగరాస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ పెర్ఫామెన్స్పపై సర్వత్రా ఆసక్తి నెలకొంది