Ishan Kishan Fastest 200: గేల్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఇషాన్ కిషన్!
Ishan Kishan breaks Chris Gayles fastest ODI double hundred record. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా డుబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
Ishan Kishan breaks Chris Gayle and Virender Sehwags fastest ODI double hundred record: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. గాయపడిన కెప్టెన్ రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్.. 126 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతకం అనంతరం రెచ్చిపోయిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. కేవలం 41 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. మొత్తంగా మూడో వన్డేలో 131 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ డబుల్ సెంచరీతో ఇషాన్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా డుబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. వన్డే ప్రపంచకప్ 2015లో జింబాబ్వేపై 138 బంతుల్లోనే గేల్ డబుల్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన కిషన్.. గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 140 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు.
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన బ్యాటర్‌గా కూడా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2011లో వాట్సన్ 185 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ (175) ఉన్నాడు. డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడు కూడా ఇషానే కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌పై ఒకే వన్డేలో అత్యధిక సిక్స్‌లు (10) బాదిన టీమిండియా బ్యాటర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (7 సిక్స్‌లు) పేరిట ఈ రికార్డు ఉంది.
డబుల్ సెంచరీ బాదిన తొలి లెఫ్టార్మ్ భారత బ్యాటర్ కూడా ఇషాన్ కిషానే. అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన భారత్ వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ గుర్తింపు పొందాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న (183) రికార్డును ఇషాన్ అధిగమించాడు. టీమిండియా తరఫున డబుల్ సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. ఇషాన్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేల్లో ద్విశతకాలు నమోదు చేశారు.
Also Read: ఆడుకుంటున్న పిల్లాడి వద్దకు భారీ కింగ్ కోబ్రా.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే వణికిపోతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.