Ishan Kishan jumpes 68 places to enters top 10 in ICC T20I rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న ఇషాన్‌ .. ఏకంగా 68 స్థానాలు ఎగబాకి  7వ ర్యాంకును చేరుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌ తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇషాన్ మాత్రమే టాప్‌-10లో ఉన్నాడు. టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు 164 పరుగులు బాదాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇషాన్‌ కిషన్ ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి.. 689 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. టీమిండియా యువ ప్లేయర్ శ్రేయాస్‌ అయ్యర్‌ 17వ స్థానానికి పడిపోగా.. స్టార్ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (14), రోహిత్‌ శర్మ (16), విరాట్‌ కోహ్లీ (21)వ స్థానంలో ఉన్నారు. టీ20 ప్రపంచ నెంబర్‌వన్‌ బ్యాటర్‌గా బాబర్‌ ఆజామ్ (818 పాయింట్లు) ఉండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ (794) రెండో స్థానంలో, ఐడెన్‌ మార్క్రమ్‌ (772) మూడో స్థానంలో ఉన్నారు.


టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌కి కూడా చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ 7 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ 26వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (792 పాయింట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గానిస్తాన్‌ ప్లేయర్ మహ్మద్‌ నబీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌ రెండు, ఇంగ్లండ్‌ స్టార్ మొయిన్‌ అలీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.



వన్డే ర్యాకింగ్స్‌ బ్యాటింగ్ విభాగంలో బాబర్‌ ఆజామ్ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్‌.. మార్నస్ లబుషేన్‌ను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌ శర్మ ఎనిమిదో స్థానంలో, విరాట్ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. ఆర్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా టాప్‌లో ఉన్నాడు. 


Also Read: Kiara Advani Pics: తెల్ల చీరలో.. మల్లెపువ్వులా మెరిసిపోతున్న కియారా అద్వానీ!


Also Read: Neha Shetty Pics: నేహా శెట్టి హాట్ షో.. రాధిక అందాలకు కుర్రకారు ఫిదా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook