India beat Sri Lanka in 1st T20: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన‌ 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన లంక నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దాంతో భారత్ 62 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. చరిత్ అసలంక (53; 47 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. చమిక కరుణరత్నే (21), దుష్మంత చమీర (24) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్ వేసిన తొలి బంతికే పథుమ్‌ నిశాంకని బౌల్డ్ చేశాడు. కాసేపటికే మరో ఓపెనర్‌ కమిల్ మిశారా (13) భువీ బౌలింగ్లోనే రోహిత్‌ శర్మకి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆపై జనిత్ లియనగె (11), దినేశ్ చండిమాల్ (10), దసున్ శనక (3) విఫలమ్యారు. ఈ సమయంలో చరిత్‌ అసలంక, చమిక కరుణరత్నె కాసేపు నిలకడగా ఆడారు. అయితే 16వ ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌.. కరుణరత్నెను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చిన దుష్మంత చమీర 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, వెంకటేశ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, చహల్‌ తలో వికెట్ తీశారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్ కిషన్‌ (89: 56 బంతుల్లో 10×4, 1×6), స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ (57: 28 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (44: 32 బంతుల్లో 2×4,1×6) కీలక పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, దసున్ శనక తలో వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఇక రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా 10వ టీ20 విజ‌యాన్ని అందుకుంది. 


Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!


Also Read: IPL 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ 2022కు ముహూర్తం ఖరారు! ప్రేక్షకులకు అనుమతి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook