Shadab Khan: నోరు జారిన పాక్ ఆల్‌రౌండర్.. స్టంప్ మైక్‌లో రికార్డు కాకపోయింటే..!
Shadab Khan Abuse Video: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తట్టుకోలేకపోయిన ఈ ఆల్‌రౌండర్.. వెంటనే దుర్భాషలాడాడు. అతను మాట్లాడిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shadab Khan Abuse Video: పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ సహనం కోల్పోయాడు. క్లీన్ బౌల్డ్ అయిన తరువాత దుర్భాషలాడాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు షాదాబ్ ఖాన్‌ను బౌలర్ బౌల్డ్ అవ్వగానే.. అతను కోపం తెచ్చుకుని స్టంప్‌లను కొట్టేందుకు ప్రయత్నించడం చూడవచ్చు. వెంటనే దుర్భాషలాడాడు. ఈ ఘటన ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
ఈ నెల 7న రావల్పిండిలో జరిగిన పీఎస్‌ఎల్‌లో ఇది 24వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తన నోటికి పనిచెప్పాడు. షాదాబ్ ఖాన్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి ముల్తాన్ సుల్తాన్ బౌలర్ ఎహసానుల్లా వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. మంచి జోరు మీద ఉన్న సమయంలో అనుకోకుండా క్లీన్‌బౌల్డ్ కావడంతో షాదాబ్ ఖాన్ కోపంతో దూషించే పదాలు ఉపయోగించాడు. అవి స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహ్మద్ రిజావాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. షాన్ మసూద్ 50 బంతుల్లో 12 ఫోర్లలో 75 పరుగులతో రాణించాడు. టిమ్ డేవిడ్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముల్తాన్ జట్టు భారీ స్కోరు చేసింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫహీమ్ అష్రఫ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో పాటు కెప్టెన్ షాదాబ్ ఖాన్ 44, కొలిన్ మున్రో 40 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!
Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook