Ganguly On IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద విషయం కాదు.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసు: గంగూలీ
Sourav Ganguly on India vs Pakistan Asia Cup 2022 clash. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసని, పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు అని సౌరవ్ గంగూలీ అన్నారు.
Sourav Ganguly on India vs Pakistan Asia Cup 2022 clash: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా దాయాది జట్లు ఆదివారం తలపడనున్నాయి. చివరిసారిగా ఇరు జట్లు తలపడిన టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో రేపు జరిగే మ్యాచులో గెలుపొంది ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచుపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసని, పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు అని సౌరవ్ గంగూలీ అన్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దాదా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్.. సాధారణ మ్యాచ్ మాత్రమే. రెగ్యులర్‌గా క్రికెట్ ఆడే వారు లేదా నేను ఆడేటప్పుడు పాకిస్థాన్‌ను ఎప్పుడూ ప్రత్యేక మ్యాచ్‌గా తీసుకోలేదు. నిజమే.. నాకౌట్‌లో అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగేది నాకౌట్ మ్యాచ్ కాదు కదా' అని అన్నారు.
'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. ఇలా భారత జట్టులో అందరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. పాకిస్థాన్‌తో మ్యాచ్ వారికి పెద్ద విషయం కాదు. ఓ సాధారణ మ్యాచులా ఆడితే సరిపోతుంది. భారత్ మంచి జట్టు. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో భారత్ గెలిచింది. ప్రపంచకప్ 2022లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా' అని దాదా పేర్కొన్నారు.
Also Read: Asia Cup 2022: ఆసియా కప్‌లో రేపే భారత్, పాకిస్థాన్ మ్యాచ్..ఇరు జట్లు ఎన్ని సార్లు గెలిచాయో తెలుసా..?
Also Read: నీలా సిక్సులు కొట్టాలనుకుంటున్నా.. అఫ్రిదికి పంత్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook