బుమ్రా సరికొత్త రికార్డు; ఆదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ !
టీమిండియా ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన భారత బౌలర్ గా అవతరించాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటి వరకు 45 వికెట్లను పడగొట్టాడు. ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో 6 వికెట్లు పడిగొట్టి భుమ్రా ఈ ఘనతను సాధించాడు.
9 ఏళ్ల నాటి రికార్డు బద్దలు
ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టామ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉంది. 1979లో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన దిలీప్ ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టాడు. దిలీప్ దోషి తర్వాత 1996లో వెంకటేష్ ప్రసాద్ 37 వికెట్లు , 1988లో నరేంద్ర హిర్వాణీ 36 , 2006లో శ్రీశాంత్ 35లు ఉన్నారు. ఈ దిగ్గజ బౌలర్లను వెనక్కి నెట్టి బుమ్రా 45 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తాజా పరిణామంతో భుమ్రా 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించినట్లయింది.
అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం
వచ్చిన తొలినాళ్లలో బుమ్రా టి 20 స్పెషలిష్ట్ బౌలర్ గా మాత్రమే గుర్తింపు పొందాడి. పొట్టి క్రికెట్ లో సత్తా చాటుతూ వచ్చి బుమ్రాకు అటు వన్డేలు ఇటు టెస్లులు ఇలా అన్ని ఫార్మట్లలో అవకాశం దొరికింది. ఈ క్రమంలో అందివచ్చిన అన్ని అవకాశాలను బుమ్రా సద్వినియోగం చేసుకున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే ఆడిన బుమ్రా 45 వికెట్లు పడగొట్టి ఈ అరుదైన రికాన్డును సొంతం చేసుకున్నాడు