Jasprit Bumrah hit back Critics After Being Ruled Out Of T20 World Cup 2022: వెన్ను నొప్పితో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. అక్టోబర్ 16 నుంచి ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్‌ 2022కి దూరమయ్యాడు. గాయం కారణంగా ముందుగా ఆసియా కప్‌ 2022 టోర్నీకి దూరమయిన బుమ్రా.. ఆపై స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు. మూడు మ్యాచుల సిరీస్‌లో రెండు, మూడో టీ20లలో ఆడాడు. గాయం తిరగబెట్టడంతో ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆడలేదు. ఆపై మెగా టోర్నీకి దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022కు దూరమైన జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ అవుతోంది. జాతీయ జట్టు తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోతున్న బుమ్రా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం అన్ని మ్యాచ్‌లూ ఆడేందుకు మాత్రం ఫిట్‌నెస్‌, గాయాలు అడ్డు రావడం లేదా అని క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేశారు. భారత జట్టు కోసం ఆడేందుకు గాయాలను సాకుగా చూపిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు బుమ్రా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. 


జస్ప్రీత్‌ బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే..  నువ్వు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు' అని బుమ్రా పేర్కొన్నాడు. మీ విమర్శలకు నేను స్పందించలేను అని బుమ్రా చెప్పకనే చెప్పాడు. యూకే మాజీ ప్రధాని విన్‌స్టల్ చర్చిల్ కొటేషన్‌ను టీమిండియా పేసర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


టీ20 ప్రపంచకప్‌ 2022 నుంచి జస్ప్రీత్‌ బుమ్రా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ ట్వీట్ అనంతరం బుమ్రా స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోవడం భావోద్వేగానికి గురిచేసిందన్నాడు. గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా స్థానంలో టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు బీసీసీఐ.


Also Read: తల్లిపై రాహుల్ గాంధీ ప్రేమ.. పాదయాత్రలో సోనియా గాంధీ 'షూ' లేస్ కట్టిన రాహుల్!


Also Read: Kyle Mayers Six: వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్! వీడియో చూస్తే మతిపోవాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook