Jhulan Goswami ODI Wickets: మహిళా క్రికెట్ లో భారత క్రికెటర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డును సృష్టించింది. ప్రపంచకప్ వేదికగా ఈ ఘనతను సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో 250 వికెట్ల మార్క్ ను చేరుకున్న తొలి మహిళా క్రికెటర్ గా జులన్ గోస్వామి నిలిచింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం ఇంగ్లాండ్ తో జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో ఒక వికెట్ పడగొట్టిన జులన్ గోస్వామి.. 250 వికెట్ల ఘనతను చేరుకుంది. వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు 199 మ్యాచ్ లు ఆడిన జులన్‌ గోస్వామి.. 250 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా, బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బౌలర్‌ ఫిట్జ్‌ ప్యాట్రిక్‌ (180 వికెట్లు) ఉండగా.. మూడో స్థానంలో వెస్టిండీస్‌ పేసర్‌ అనిసా మహమ్మద్‌ (180 వికెట్లు) నిలిచింది.


ప్రపంచకప్ లో భాగంగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య బుధవారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (35), వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ (33), జులన్ గోస్వామి (20) సహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. 



135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు.. 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది.  ఇంగ్లాండ్ బ్యాటర్లు హీథర్‌ నైట్ (53), నటాలీ సివర్‌ (45) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే ఈ ప్రపంచకప్ లో టీమ్ఇండియా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 2 మ్యాచుల్లో ఓటమి పాలైంది. కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.  


Also Read: IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!


Also Read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook