2007 T20 World Cup Hero Joginder Sharma retires from all forms of cricket: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, 2007 టీ20 ప్రపంచకప్‌ హీరో జోగిందర్‌ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మాత్రమే కాకుండా అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించాడు. జోగిందర్‌ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 2004లో జాతీయ జట్టులోకి వచ్చిన జోగిందర్.. 2023లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి హీరో అయిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఎంతో గర్వంతో ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే కాకుండా దేశవాళీ ఆటకు సైతం వీడ్కోలు పలుకుతున్నా. 2002-07 మధ్యలో సాగిన క్రికెట్‌ ప్రయాణం నా జీవితంలో ఎన్నో అనుభవాలను మిగిల్చింది. భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. అవకాశం కల్పించిన బీసీసీఐ, హరియాణా క్రికెట్‌ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్‌, హరియాణా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. కోచ్, సహచరులు, మెంటార్స్, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటా. అభిమానులకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. క్రికెటర్‌గా, పోలీస్‌ ఆఫీసర్‌గా ఎదగడంలో సహకరించిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు' అని జోగిందర్‌ శర్మ ట్వీట్ చేశాడు. 


హర్యానాలోని రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన జోగిందర్‌ శర్మ.. 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. జోగిందర్‌ శర్మ భారత్ తరఫున నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో 1 వికెట్, టీ20లో 4 వికెట్స్ పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచే భారత్ తరఫున జోగిందర్‌ ఆడిన చివరి మ్యాచ్. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో రాణించినప్పటికీ.. భారత జట్టులో ఆడే అవకాశాలు రాలేదు. 2007లో హరియాణా పోలీస్‌ శాఖలో జాయిన్‌ అయిన జోగిందర్‌ శర్మ.. 2020లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు.  



2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 5 వికెట్లకు157 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 19 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది. చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 13 పరుగులు అవసరం. కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ క్రీజ్‌లో ఉండగా.. ఎంఎస్ ధోనీ బంతిని జోగిందర్‌ శర్మకు ఇచ్చాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన జోగిందర్.. రెండో బంతికి సిక్స్‌ ఇచ్చాడు. దీంతో 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. మరో సిక్స్ కొడితే పాక్‌ గెలుస్తుందని భారత ఫాన్స్ ఆందోళన చెందారు. అయితే జోగిందర్‌ వేసిన బంతిని స్కూప్ చేయబోయిన మిస్బా.. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ చేతికి చిక్కాడు. దాంతో పాక్‌ 152 పరుగులకే ఆలౌట్‌ కావడంతో తొలి పొట్టి కప్ టైటిల్‌ భారత్ ఖాతాలో పడింది.


Also Read: Mahindra Electric SUV: మహీంద్రా నుంచి 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక టాటాకు 'టాటా బై-బై' చెప్పాల్సిందే!  


Also Read: Tata Nexon Price 2023: రూ 6 లక్షలకే టాటా నెక్సాన్ కార్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! ఈ అవకాశం మళ్లీ రాదు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.