Jos Buttler takes one handed catch to dismiss Marcus Harris in Adelaide Test: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన, అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి అద్భుత క్యాచ్‌తో ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్‌లు పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువగా ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఐపీఎల్, పీఎస్‌ఎల్, బిగ్‌బాష్‌, సీపీఎల్ లాంటి టోర్నీలలో స్టన్నింగ్ క్యాచ్‌లు చాలానే చూశాం. తాజాగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ (Jos Buttler) అలాంటి ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021‌ (Ashes 2021)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బట్లర్ అచ్చం పక్షిలానే డైవ్ చేసి సూపర్ క్యాచ్ (Super Catch) అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (Australia vs England) జట్ల మధ్య ఆడిలైడ్‌ వేదికగా ఈరోజు రెండో టెస్ట్ ప్రారంభం అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన ఇంగ్లండ్ పేసర్ సువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో జోస్ బట్లర్ (Jos Buttler) సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాడ్ షార్ట్ పిచ్‌ రూపంలో సాధించగా.. ఆసీస్ ఓపెనర్ మార్కస్ హారిస్ (Marcus Harris) లెగ్‌ సైడ్‌ దిశగా ఆడాడు. కానీ మిస్‌ టైమ్ అయిన బంతి.. కీపర్ కుడివైపుకు దూరంగా వెళ్లింది. బంతిని సరిగ్గా అంచనా వేసిన బట్లర్.. అచ్చం పక్షిలానే డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అనంతరం తేరుకుని నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. 


Also Read: Omicron In India: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్ తప్పదు! అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!


జోస్ బట్లర్ (Jos Buttler) పట్టిన క్యాచ్‌ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. సహచర ఆటగాళ్లు 'సూపర్ క్యాచ్' (Super Catch)  అంటూ చప్పట్లతో అభినందించారు. కామెంటేటర్లు సైతం బట్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బట్లర్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన వారు 'స్టన్నింగ్ క్యాచ్', 'సూపర్ క్యాచ్' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచులో మార్కస్ హారిస్ (Marcus Harris) పూర్తిగా నిరాశపరిచాడు. 28 బంతులు ఆడిన హారిస్.. 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 


Also Read: Viral Video : పెళ్లి మండపంలోనే డ్యాన్స్ చేసిన వరుడు.. మంత్రాలు చదువుతూ స్టెప్స్ వేసిన పంతులు




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook