Junaid Siddique Six: బాప్రే.. ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్! వైరల్ అయిన యూఏఈ ప్లేయర్ సెలెబ్రేషన్స్
UAE Batter Junaid Siddique smashesh 109m Six vs Sri Lanka in T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిఖి 109 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.
UAE Batter Junaid Siddique smashesh 109m Six vs Sri Lanka in T20 World Cup 2022: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి సిద్ధిఖి భారీ సిక్సర్ కొట్టాడు. స్టంప్స్ పైకి వచ్చిన బంతిని సిద్ధిఖి భారీ షాట్ ఆడగా.. డీప్ మిడ్ వికెట్ మీదుగా వెళ్లి స్టేడియం బయట పడింది. బంతి గాల్లోనే చాలా సమయం ఉంది.
భారీ సిక్సర్ బాదిన అనంతరం యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిఖి చేసుకున్న సెలెబ్రేషన్స్ అందరిని ఆకట్టుకుంది. సిక్సర్ కొట్టిన అనంతరం తన బలం ఇదంటూ మైదానంలోని ప్రేక్షకులకు కండలు చూపించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధిఖి కొట్టిన సిక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచులో సిద్ధిఖి 16 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ఇందులో ఓ ఫోర్, సిక్స్ ఉన్నాయి.
ఈ మ్యాచులో యూఏఈ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. పాతుమ్ నిస్సాంక (74) హాఫ్ సెంచరీ చేయగా.. ధనంజయ డిసిల్వా (33) పరుగులు చేరాడు. యూఏఈ బౌలర్ కార్తీక్ మేయప్పన్ (3/19) హ్యాట్రిక్‌తో చెలరేగాడు. 153 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్జల్ ఖాన్ (19), సిద్ధిఖి (18) మినహా బాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ అందుకోలేదు. హసరంగ (3/8), చమీర (3/15) తలో మూడు వికెట్లతో చెలరేగారు.
Also Read: Mohammad Shami: మహమ్మద్ షమీని చూసి ఆశ్చర్యపోయాం: ఆకాశ్ చోప్రా
Also Read: భారత క్రికెట్‌లో ఆ రెండు పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది: బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook