IND vs SA: ముగిసిన మూడో రోజు ఆట.. విజయానికి చేరువలో దక్షిణాఫ్రికా! ఇంకా 122 పరుగులే!!
మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి చేరువ అయింది.
South Africa need 122 to win 2nd Test vs India: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి చేరువ అయింది. భారత్ (India) నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా (South Africa) రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్ (46), స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (11) ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 122 పరుగులు మాత్రమే చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం.. ఆతిథ్య జట్టు ప్రొటీస్ చేతిలో ఎనిమిది వికెట్లు ఉండటంతో విజయ అవకాశాలు వారికే అధికంగా ఉన్నాయి. బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తే తప్ప.. దక్షిణాఫ్రికా విజయాన్ని భారత్ అడ్డుకోలేదు.
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజైన బుధవారం ఆటను ప్రారంభించిన టీమిండియాకు టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాటర్లు చేతేశ్వర్ పుజారా (53), అజింక్య రహానే (58) మంచి ఆరంభమే అందించారు. చెత్తబంతులను మాత్రమే ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో పుజారా - రహానే (Pujara-Rahane)అర్ధ శతకాలు నమోదు చేసుకున్నారు. వీరద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో పుజారా, రహానేతో పాటు రిషబ్ పంత్ (0) పెవిలియన్‌కు చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కాస్త దూకుడుగా ఆడిన ఆర్ అశ్విన్ (16) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్ (28), హనుమ విహారి (40) టీమిండియాకు విలువైన పరుగులు అందించారు. టెయిల్ ఎండర్లు క్రీజులో నిలవలేకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: ఈ ఫొటోలలో ఉన్న సొట్టబుగ్గల సుందరిని మీరు గుర్తుపట్టారా?
240 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్ (31), డీన్ ఎల్గర్ (Dean Elgar) 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. మార్‌క్రమ్ (Aiden Markram) ధాటిగా ఆడినా.. ఎల్గర్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్‌క్రమ్ ఔట్ కాగా.. కీగన్ పీటర్సెన్ అండతో ఎల్గర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. పీటర్సెన్‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చినా.. ఎల్గర్ తడబడలేదు. ఈ క్రమంలో ప్రొటీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 రన్స్ చేయగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసింది.
Also Read: PM Narendra Modi: ప్రాణాలతో చేరుకోగలిగాను.. మీ సీఎంకు థాంక్స్: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook