Kane Williamson Quits Test Captainship: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు లెజెండరీ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కివీస్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. కేన్ స్థానంలో సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ మేరకు బుధవారం రాత్రి న్యూజిలాండ్ క్రికెట్ సమాచారం ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది సరైన సమయం


ఈ సందర్భంగా కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడానికి ఇదే సరైన సమయం అని అన్నాడు. టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన విశేష గౌరవమని చెప్పాడు. టెస్టు క్రికెట్ తనకు అత్యున్నతమైనదని.. కెప్టెన్‌గా అనేక సవాళ్లను తాను ఆస్వాదించానని అన్నాడు. కెప్టెన్‌గా పని భారం పెరిగిందని.. తన కెరీర్‌లో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావించానని తెలిపాడు.


 



న్యూజిలాండ్ అత్యుత్తమ కెప్టెన్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. కేన్ కెప్టెన్సీలోనే కివీస్ జట్టు భారత్‌ను ఓడించి తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. అతని కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. 38 టెస్ట్ మ్యాచ్‌లకు న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో అతను 22 సార్లు జట్టును గెలిపించాడు.  8 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


కొత్త టెస్టు కెప్టెన్‌గా టిమ్ సౌథీ 


కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. పాక్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టామ్ లాథమ్ జట్టు వైస్ కెప్టెన్సీని చూసుకుంటాడు. న్యూజిలాండ్ జట్టుకు టిమ్ సౌథీ 31వ టెస్టు కెప్టెన్ అయ్యాడు. ఇటీవల విలయమ్సన్ గైర్హాజరీతో కొన్ని మ్యాచ్‌లకు టిమ్ సౌథీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 


రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 34 ఏళ్ల సౌథీ ఇప్పటివరకు 88 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సుదీర్ఘ క్రికెట్ ఫార్మాట్‌లో మొత్తం 347 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5 అర్ధ సెంచరీలతో 1855 పరుగులు చేశాడు. వన్డేల్లో 204 వికెట్లు, టీ20ల్లో 134 వికెట్లు తీశాడు. 


Also Read: LIC Policy: కేవలం రూ.70 పెట్టుబడితో రూ.48 లక్షల ఆదాయం.. ఇలా చేయండి


Also Read: India Attacks China-Pak: చైనా-పాక్‌ పరువు తీసిన భారత్.. యూఎన్‌ఎస్‌సీలో సూపర్ కౌంటర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook