Kane Williamson test positive for Covid 19, miss England vs New Zealand 2nd Test: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న కివీస్ జట్టుకు కరోనా రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కరోనా బారిన పడ్డాడు. రెండో మ్యాచ్‌ ఆరంభానికి ముందు శుక్రవారం నిర్వహించిన రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో కేన్‌ మామకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల పాటు విలియమ్సన్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ శుక్రవారం ఆరంభం కానుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. కీలక మ్యాచుకు ముందు కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడటం న్యూజిలాండ్ జట్టులో ఆందోళనలకు గురి చేసింది. విలియమ్సన్ తప్పుకోవడంతో.. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ పేర్కొన్నారు. ఇక విలియమ్సన్‌ స్థానాన్ని హమీష్‌ రూథర్‌ఫర్డ్‌తో భర్తీ చేయనున్నాడు. 


గ్యారీ స్టెడ్‌ మాట్లాడుతూ... 'కీలక మ్యాచ్‌లకు ముందు కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడడం బాధగా ఉంది. జట్టుకు దూరమవ్వడాన్ని కేన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు ఎంతగా నిరాశ చెందాడో మా అందరికీ తెలుసు. విలియమ్సన్‌ స్థానంలో హమీష్‌ రూథర్‌ఫర్డ్‌ జట్టులోకి వస్తాడు. అతడిపై నమ్మకం ఉంది. రెండో టెస్ట్ గెలిచేందుకే బరిలోకి దిగుతాం' అని ఆశాభావం వ్యక్తం చేశారు. 


ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ భారీ స్కోర్ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు, రెండో ఇన్నింగ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. గాయం కారణంగా కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సిరీసుకు దూరమైన విషయం తెలిసిందే.


Also Read: Nayanthara-Vignesh Wedding: మేడమ్‌ నుంచి.. సతీమణి అయ్యారు! నయనతార అనుబంధంపై విఘ్నేశ్‌ పోస్ట్  


Also Read: TS Intermediate Results 2022: ఈ వారంలోనే.. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook