Kapil Dev Daughter Amiya Dev: టీమిండియా క్రికెట్ దశ.. దిశను మార్చింది 1983 వరల్డ్ కప్. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్.. హేమాహేమీ జట్లను మట్టికరిపించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ గురించి కచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి.. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించాడు. కపిల్ దేవ్‌ను చూసి దేశంలో ఎంతో మంది క్రికెట్‌ వైపు అడుగులు వేశారు. అయితే ఈ దిగ్గజ క్రికెటర్ కూతురు అమియా దేవ్ మాత్రం డిఫరెంట్‌ రంగంలోకి ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తండ్రిలాకా క్రీడా రంగంలోకాకుండా తనదైన మార్గాన్ని ఏర్పరుచుకోవాలని ఆమె సినీ కెరీర్‌పై అడుగులు వేశారు. అమియా అనేక బాలీవుడ్ చిత్రాలలో భాగమయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాణిస్తూ.. దర్శకురాలిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  తన తండ్రి బయోపిక్ '83'తో సహా అనేక పెద్ద బాలీవుడ్ సినిమాలలో పనిచేశారు. 1983 ప్రపంచకప్ సమయంలో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ ప్రయాణం, భారత లెజెండ్ తన నైపుణ్యం, దృఢ సంకల్పంతో జట్టును ఎలా విజయతీరాలకు చేర్చాడనే దాని ఆధారంగా రూపొందించిన 83 చిత్రంలో అమియా అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు.


అమియా దేవ్ 2019లో కబీర్ ఖాన్ దర్శకత్వ బృందంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తన తండ్రి కపిల్ దేవ్ జీవితం, అతని పోరాటం గురించి ఎవరికీ తెలియని వాస్తవాలను మూవీ బృందానికి అందించారు. 83 నిర్మాణ రోజులలో కబీర్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అమియా దేవ్, ఇతర అసిస్టెంట్ డైరెక్టర్‌లను మెచ్చుకున్నారు. 83 మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్లు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే కపిల్ దేవ్, రోమీ దేవ్‌లుగా నటించారు. ఈ చిత్రంలో హార్డీ సంధు, పంకజ్ త్రిపాఠి, అమీ విర్క్, తాహిర్ రాజ్ భాసిన్, బోమన్ ఇరానీలతో సహా ఇతర నటీనటులు నటించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.193 కోట్లు వసూలు చేసింది. 


Also Read: Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం వెనుక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు  


Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook