అలా అయితే ఐపీఎల్ ఆడడం మానేయండి.. టీమిండియా ఆటగాళ్లకు కపిల్ దేవ్ కౌంటర్!
Kapil Dev advices to indian cricketers who feels pressure. ఒత్తిడితో ఆడేది ఆట కాదని, క్రికెట్‌ను ఆస్వాదించలేని వారు దాన్ని వదిలేయడమే మంచిదని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు.
Kapil Dev says Do not play in IPL If you feel lot of pressure: మానసిక ఒత్తిడి మరియు శారీరక శ్రమకు గురవుతున్నట్లు అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనకుండా ఉండాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత ఆటగాళ్లకు సూచించారు. ఒత్తిడితో ఆడేది ఆట కాదని, క్రికెట్‌ను ఆస్వాదించలేని వారు దాన్ని వదిలేయడమే మంచిదన్నారు. టీ20లు వచ్చిన తర్వాత ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్న అంశంపై ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరైన కపిల్ తన మనసులోని మాటను బయటపెట్టేశారు.
తాజ్ ప్యాలెస్‌లో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఒత్తిడిగా ఉన్నవారు ఐపీఎల్ ఆడడం మానేయండి అని అన్నారు. 'ఐపీఎల్‌లో ఆడాలంటే.. ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుందని నేను టీవీలో చాలా సార్లు వింటున్నాను. అయితే నేను ఒక్క మాట చెబుతాను.. అలా ఫీల్ అయిన వారు ఐపీఎల్ ఆడవద్దు. ఆటగాడికి అభిరుచి ఉంటే ఒత్తిడి అస్సలు ఉండదు. ఇష్టంతో ఆడేవారెవరూ ఇలా అనుకోరు. ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడతారు' అని హర్యానా హరికేన్ అన్నారు.
'ఒత్తిడి, కుంగుబాటు అనే ఈ ఇంగ్లిష్ పదాలు నాకు అస్సలు అర్థం కావు. నేనొక రైతుని. అటువంటి పరిస్థితుల మధ్య నుంచి నేను వచ్చాను. నాకు ఆడటం అంటే చాలా ఇష్టం ఉండేది. క్రికెట్‌ను మేము ఆస్వాదించేవాళ్లం. ఇష్టం ఉన్న చోట ఒత్తిడికి అవకాశమే లేదు' అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కపిల్ సారథ్యంలో భారత్ 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.
Also Read: IND vs SA: శ్రేయాస్ అయ్యర్ సెంచరీ.. రెండో వన్డేలో భారత్ విజయం! సిరీస్ 1-1తో సమం
Also Read: Krithi Shetty Pics: రెడ్ శారీలో కృతి శెట్టి.. కుర్రాళ్ల మదిని దోచుకుంటున్న బేబమ్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.