కేప్ టౌన్ : అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ తొలి క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో భారత యువ జట్టు మంగళవారం పటిష్ట ఆస్ట్రేలియాతో మంగళవారం తలపడనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి 6 పాయింట్లతో క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. ఆస్ట్రేలియా జట్టు గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌ చేతిలో ఓడి 4 పాయింట్లతో రెండోస్థానంలో క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. 


టైటిల్‌ ఫేవరేట్‌లో ఇరుజట్లు ఉండగా.. ఆసీస్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని భారత్ భావిస్తోంది. ఆసీస్‌ జట్టు పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉందని, ఇక భారత కుర్రాళ్లు అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో బలంగా ఉన్నారు. అంతేగాక డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పోటీల్లో ప్లేట్‌ లెవెల్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోటీల్లో ఇంగ్లండ్‌ జట్టు 9 వికెట్ల తేడాతో జపాన్‌ను చిత్తుచేయగా.. మరో పోటీలో శ్రీలంక జట్టు 233 పరుగుల తేడాతో నైజీరియాను చిత్తుచేసింది. మంగళవారం  ఆసీస్ భారత్ ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.