Kavya Maran Crying Video: తృటిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ట్రోఫీ తమ చేతిలో నుంచి వెళ్లిపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. జట్టు ఓటమితో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌ గుండె పగిలింది. జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రిస్తూనే నవ్వుతూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 Champion KKR:  ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌.. రన్నరప్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్


ఎన్నో ఏళ్ల కల మరోసారి వచ్చింది. కొన్నేళ్ల నుంచి నిలకడ లేని ప్రదర్శనతో ఘోర పరాభవం ఎదుర్కొంటున్న జట్టు ఈసారి అద్భుతంగా పోరాడింది. చరిత్ర రికార్డులను తిరగరాస్తూ ముందడుగు వేస్తున్న ఆ జట్టు ఆఖరి మెట్టులో మాత్రం తప్పటడుగు వేసింది. ఫలితంగా అన్ని మ్యాచ్‌ల్లో సందడి చేసిన ఆమె ఫైనల్‌లో మాత్రం కన్నీరు పెట్టేసుకుంది. చేతులారా ట్రోఫీ చేజారడంతో ఆమె గుండె పగిలింది. ఆమెనే అందరూ ప్రేమగా కావ్య పాప అని పిలుచుకునే సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌.

Also Read: IPL 2024 KKR vs SRH Live: ట్రావిస్ హెడ్‌ 'రాత' మారలేదు.. ఈ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్లు


చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని దక్కించుకుని హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్‌ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రెండుసార్లు తన రికార్డునే తానే అధిగమించింది.


ఇక ఈ మ్యాచ్‌ల్లో జట్టు ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్‌ సందడి అంతాఇంతా కాదు. ఆమె చేసే హావాభావాలు.. ఆమె ప్రదర్శించే భావోద్వేగాలు స్టేడియంలోని వారినే కాదు టీవీలు, ఫోన్ల ముందు కూర్చుని ప్రతి వీక్షకుడిని కట్టి పడేస్తాయి. స్టాండ్స్‌లో ఆమె ఉందంటే కెమెరాలన్నీ అటువైపే వెళ్తాయి. మరి అలాంటి కావ్య మారన్‌ ఫైనల్‌లో జట్టు ఓడిపోతే ఎలా తీసుకుందో చూశారు. జట్టు ఓడిన అనంతరం కావ్య మారన్‌ గుండె పగిలింది.


ఉబికి వస్తున్న కన్నీటిని ఆమె నియంత్రించుకున్నారు. కెమెరా కళ్లన్నీ తనపైనే ఉంటాయని గ్రహించి వెంటనే వెనక్కి తిరిగి ఏడ్చేసింది. కన్నీటిని తుడుచుకుని తన భావోద్వేగాలను అణచివేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కెమెరా వైపు తిరిగి నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ కనిపించింది. అయినా కూడా ఆమె ముఖంలో బాధ అనేది స్పష్టంగా కనిపించింది. జట్టు ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. అయితే ఒకవేళ హైదరాబాద్‌ ట్రోఫీ అందుకుని ఉంటే మాత్రం కావ్య మారన్‌ వైపే అందరి కళ్లు ఉండేవి. ఆమె చేసుకునే సంబరాలు ఎంత సందడిగా ఉండేవోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయ్యో అవి మిస్సయ్యామని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో మాత్రం వైరల్‌గా మారింది. కాగా సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్రదర్శన పరిశీలిస్తే 14 మ్యాచ్‌లు ఆడి 8 మ్యాచ్‌లు నెగ్గి.. ఐదింట ఓడిపోయింది. విజేత కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి 3 మ్యాచ్‌లు కోల్పోయింది.




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter