డెన్మార్క్ ఓపెన్ ఛాంపియన్ గా తెలుగు తేజం
ప్రపంచానికి తెలుగోడి సత్తాఏంటో మరోసారి తెలిసిపోయింది. సాధ్యం కాదనుకున్న వాటిని సుసాధ్యం చేసేట్లు యువతీయువకులు క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఆదివారం నాడు జరిగిన డెన్మార్క్ ఓపెన్ ఫైనల్స్. భారత బాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ దక్షిణ కొరియా ప్రత్యర్థి లీ హున్ ఇల్ ను ఓడించి కేవలం 25 నిమిషాల్లోనే ఫైనల్ ను ముగించాడు.. ఛాంపియన్ గా నిలిచాడు. ఈ విజయంతో శ్రీకాంత్ ఈ ఏడాది మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు . సైనా నెహ్వాల్ తర్వాత ఒకే ఏడాదిలో మూడు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన రెండో భారత ప్లేయర్ శ్రీశాంత్.
అందరూ హోరాహోరీగా ఫైనల్ జరుగుతుందనుకుంటే.. వన్ మ్యాన్ షో లా శ్రీశాంత్ ఇలా వచ్చి.. అలా గెలిచాడు. టీవీ ముందున్న అభిమానులు.. కోర్టులో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్య పోయేలా చేసాడు. ఈ విజయంతో శ్రీశాంత్ కు ప్రైజ్ మనీ 56,260 డాలర్లు ( 36 లక్షల 58 వేల రూపాయలు)తో పాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
అభినందించిన చంద్రబాబు..
శ్రీశాంత్ టైటిల్ నెగ్గిన తరువాత పలువురు అతడిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు- "కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ ఫైనల్స్ లో విజయం సాధించినందుకు, త్రివర్ణ పతాకం కీర్తి పెంచినందుకు అతడికి అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.