IPL 2021 records: Kieron Pollard ఖాతాలో ఐపిఎల్ 2021లో longest six రికార్డ్
Kieron Pollard hits longest six of IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్ కీరన్ పొలార్డ్ (35 నాటౌట్: 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (Most sixes in IPL history) బాదిన ఆటగాళ్లలోనూ కీరన్ పొలార్డ్ స్థానం సంపాదించుకున్నాడు.
Kieron Pollard hits longest six of IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్ కీరన్ పొలార్డ్ (35 నాటౌట్: 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సులు బాదిన కీరన్ పొలార్డ్ జట్టు విజయానికి కారణమయ్యేలా పరుగులు జోడించడంతో పాటు మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 14వ ఐపిఎల్ సీజన్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా కీరన్ పొలార్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం ఒక రికార్డ్ కాగా.. 200 సిక్సులు కొట్టిన తొలి ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌గానూ తన పేరు నమోదు చేసుకోవడం అతడు సాధించిన మరో రికార్డ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ముజిబిర్ రెహ్మాన్ వేసిన బంతిని కాస్త వెనక్కి జరిగి ఒక్క కాలిపై నిలబడుతూ కీరన్ కొట్టిన సిక్సుకి బంతి వెళ్లి 105 మీటర్ల దూరంలో ఎం.ఏ. చిదంబరం స్టేడియం బయటపడింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఇదే లాంగెస్ట్ సిక్స్.
ఐపిఎల్ 2021లో లాంగెస్ట్ సిక్సుల రికార్డ్స్ విషయానికొస్తే, కీరన్ పొలార్డ్ కంటే ముందుగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell-100m), సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav -99m), మనీష్ పాండే (Manish Pandey -96m), అబ్దుల్ సమద్ (Abdul Samad -93m) ఉన్నారు.
Also read : IPL 2021, MI vs SRH: ముంబై ఇండియన్స్ గెలుపు.. హైదరాబాద్‌కి వరుసగా మూడో ఓటమి
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (Most sixes in IPL history) బాదిన ఆటగాళ్లలోనూ కీరన్ పొలార్డ్ స్థానం సంపాదించుకున్నాడు. క్రిస్ గేల్ అత్యధికంగా 351 సిక్సులు కొట్టగా, ఏబీ డివిలియర్స్ 237, రోహిత్ శర్మ (Rohit Sharma) 217 సిక్సులు, మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 216 సిక్సులు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో 201 సిక్సులతో విరాట్ కోహ్లీ, కీరన్ పొలార్డ్ (Virat Kohli, Kieron Pollard) ఇద్దరూ సమానమైన రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే, 200 సిక్సులు కొట్టిన తొలి ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్‌గా మాత్రం మళ్లీ కీరన్ పొలార్డ్ ముందున్నాడు. 166 సిక్సులతో రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
వెస్టిండీస్ బ్యాట్‌మేన్ అయిన కీరన్ పొలార్డ్ 2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంపాటు ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతుంటంతో అతడు కొట్టిన అత్యధిక సిక్సులు అతడికి ఆ జట్టు తరపున 200 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగానూ రికార్డు సొంతమయ్యేలా చేశాయి.
Also read : Ashish Nehra: అది మార్చుకోకపోతే టీమిండియాలోకి Manish Pandey కష్టమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook