KKR beats DC, Qualifier 2 match Highlights: ఐపిఎల్ 2021 క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ వీడింది. ఫైనల్‌కి చేరే జట్టు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చేసింది. అవును.. ఐపిఎల్ 2021 ఫైనల్స్‌కి చేరేందుకు గెలిచి తీరాల్సిన కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ డీలా పడింది. ఢిల్లీపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు అర్హత సాధించింది. ఇక మిగిలిందల్లా ఛాంపియన్స్ టైటిల్ కోసం ఐపిఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న అంతిమ సమరమే (CSK vs KKR IPL 2021 final match). ఈ పోరులో ఎవరు గెలిస్తే.. వారే ఐపిఎల్ 2021 విజేతలు.