KKR vs RR match live score updates, time and preview: ఐపిఎల్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఐపిఎల్ 2021 లో 54వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అందులో 6 మ్యాచుల్లో విజయం సాధిస్తే మరో 7 మ్యాచుల్లో ఓటమిపాలైంది. పాయింట్స్ పట్టిక పరంగా నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ నేటి మ్యాచ్‌లో గెలిచి ర్యాంకింగ్స్ పరంగా తమని తాము ఇంకొంత మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాయింట్స్ పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ఒక్క అడుగు వెనక.. ముంబై ఇండియన్స్ కంటే ఒక్క అడుగు ముందున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గెలిచి తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.  


ఐపిఎల్ 2021 దుబాయ్ షెడ్యూల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. రెండో షెడ్యూల్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో విజయం సొంతం చేసుకోగా రెండింట్లో ఓటమిపాలైంది. ఓడిన రెండు మ్యాచులు కూడా కొద్దిపాటిలో చివరి ఓవర్లో చేజారినవే. ఈ షెడ్యూల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్‌లో వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితిష్ రానా వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఎటొచ్చి కోల్‌కతా స్కిప్పర్ ఇయాన్ మోర్గాన్ ఫామ్ గురించే కొంత ఆందోళన కనిపిస్తోంది. 


Also read : IPL 2021: CSK జట్టులోకి కరేబియన్ క్రికెటర్..సామ్‌ కరన్‌ స్థానంలో..


ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు అసలు రేసులోనే లేదనుకోవాల్సిందే. 8 జట్లు పాల్గొంటున్న ఈ ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌లో ప్రస్తుతం మరో ఆరు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయనగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ పట్టికలో ఇంకా 7వ స్థానంలోనే కొనసాగుతోంది. 


Kolkata Knight Riders team against Rajastan Royals - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులు :
కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్, గుర్కీరత్ సింగ్ మన్, కరుణ్ నాయర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, హర్భజన్ సింగ్, కమలేష్ నాగరకోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, పవన్ నేగి, ఎం. ప్రసిద్ కృష్ణ, సందీప్ వారియర్ , శివమ్ మావి, టిమ్ సౌతీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, షెల్డన్ జాక్సన్, టిమ్ సీఫర్ట్.


Rajastan Royals team against Kolkata Knight Riders - రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు :
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఒషనే థామస్, ముస్తఫిజుర్ రహమాన్, తబరైజ్ షమ్సీ, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ జకారియా, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, అనుజ్ రావత్, కెసి కరియప్ప, యశశ్వి జైస్వాల్, శివమ్ దూబే, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కట్, కుల్దీప్ యాదవ్, మహిపాల్ లొమ్రర్.


Also read : RCB vs SRH Match Highlights: ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో RCB పై SunRisers Hyderabad విజయం


KKR vs RR match time today - ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ టైమ్ ఏంటి ?
నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ రాత్రి 7 గంటలకు టాస్ వేయనుండగా, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


KKR vs RR match venue - కోల్‌కతా vs రాజస్తాన్ మ్యాచ్ వేదిక:
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కి షార్జా స్టేడియం వేదిక కానుంది.


KKR vs RR match live broadcasting - ఏ టీవీ ఛానెల్లో ఈ మ్యాచ్ లైవ్ ప్రసారం కానుంది ?
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals match) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1HD లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 


KKR vs RR match live streaming link - మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ :
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ని హాట్ స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఇవే కాకుండా https://zeenews.india.com/telugu పై సైతం ఎప్పటికప్పుడు మ్యాచ్‌ స్కోర్ లైవ్ అప్‌డేట్స్ చెక్ చేయవచ్చు.


Also read: IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఎవరు టాప్, ఎవరు ఫ్లాప్ ?


Also read: DC vs CSK match highlights: ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపె గెలిచిన ఢిల్లీ.. IPL 2021 లో అగ్రస్థానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook