Shashank Singh Catch: బౌండరీ లైన్ వద్ద శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన అజింక్య రహానే! సచిన్ పొగడ్తలు
Shashank Singh takes catch to dismissed Ajinkya Rahane. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ శశాంక్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
Shashank Singh takes outstanding catch to dismissed Ajinkya Rahane: క్రికెట్ ఆటలో ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని అందరిని ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకుంటారు. ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. తాజాగా ఐపీఎల్ 2022లో అంతకుమించి క్యాచ్ నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ శశాంక్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వెంకటేష్ అయ్యర్ (7) త్వరగానే ఔట్ అయినా.. నితీశ్ రాణా (26), అజింక్య రహానే (28)లు జట్టును ఆదుకున్నారు. అయితే ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఓవర్‌లోనే ఈ ఇద్దరిని పెవిలియన్‌కు చేర్చాడు. 8వ ఓవర్ మూడో బంతికి నితీష్ రాణాను ఔట్ చేశాడు. దాంతో ఈ భాగస్వామ్యానికి తెరదించాడు.
ఇక అదే ఓవర్ చివరి బంతిని అజింక్య రహానే అప్పర్ కట్ ఆడగా.. బంతి సిక్సర్‌గా వెళ్లింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్నాడు. ఆపై కిందపడిన శశాంక్.. తన బ్యాలెన్స్‌ను చక్కగా అదుపుచేసుకున్నాడు. ఇంకేముంది రహానే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక తాను కొట్టిన బంతి కచ్చితంగా సిక్సర్‌గా భావించిన రహానే శశాంక్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఒక్కసారిగా బిత్తర పోయాడు.
ప్రస్తుతం శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్ క్యాచ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', 'టేక్ ఏ బో', 'ఐపీఎల్ 2022లో సూపర్ క్యాచ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయడంతో కోల్‌కతా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read: Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం
Also Read: SVP OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.