రెండో టీ20లో కివీస్ పై భారత్ ఘన విజయం
ఆక్లాండ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
హైదరాబాద్: ఆక్లాండ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ స్వేచ్ఛగా పరుగులు తీయలేకపోయారు. కివీస్ బ్యాట్స్ మెన్లు మార్టిన్ గఫ్తిల్ 33, సీఫెర్ట్ 33, కొలిన్ మన్రో 26, రాస్ టేలర్ 18 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో జడేజా 2, బుమ్రా, దేవేష్ దుబె, శార్దూల ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. 133 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేఎల్ రాహుల్ 57, శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులు చేసి 17.3 ఓవర్లలోనే 135 పరుగులు చేసి జట్టును అలవోకగా గెలిపించారు. దీంతో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..