KL Rahul fitness: కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ మంత్ర వీడియో చూస్తే మోటివేట్ అవ్వాల్సిందే
లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్లు అంతా క్రీడలకు దూరం కావడంతో తమ శరీరం ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉండటం కోసం ఎప్పటిలాగే నిత్యం కొంత సమయాన్ని ఇండోర్ ఎక్సర్‌సైజెస్‌కి కేటాయించడం మర్చిపోవడం లేదు. లేదంటే మళ్లీ మైదానంలోకి వచ్చాకా ఇబ్బందులు తప్పవని వాళ్లకు తెలుసు కనుక. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం ఇంట్లోనే ఇదిగో ఇలా రకరకాల ఎక్సర్‌సైజెస్‌తో వ్యాయమం చేస్తున్నాడు.
లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్లు అంతా క్రీడలకు దూరం కావడంతో తమ శరీరం ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉండటం కోసం ఎప్పటిలాగే నిత్యం కొంత సమయాన్ని ఇండోర్ ఎక్సర్‌సైజెస్‌కి కేటాయించడం మర్చిపోవడం లేదు. లేదంటే మళ్లీ మైదానంలోకి వచ్చాకా ఇబ్బందులు తప్పవని వాళ్లకు తెలుసు కనుక. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం ఇంట్లోనే ఇదిగో ఇలా రకరకాల ఎక్సర్‌సైజెస్‌తో వ్యాయమం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ తన వ్యాయమం వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు. అంతేకాకుండా ''ఎండింగ్ ద వీక్ స్ట్రాంగ్'' అంటూ ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. లాక్ డౌన్ సమయంలో ఢీలా పడినవాళ్లంతా రాహుల్ ఫిట్‌నెస్ వీడియో చూస్తే మోటివేట్ అవడం ఖాయం.
Also read : కేవలం ఒక్క రాష్ట్రంలోనే 8,068 కరోనా పాజిటివ్ కేసులు, 342 మంది మృతి
ఇంట్లో జిమ్ పరికరాలు లేకున్నా.. చిన్న చిన్న ఐడియాలతోనే ఎలా వ్యాయమం చేసుకోవచ్చో కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ మంత్ర వీడియో చూస్తే అర్థమవుతుంది. సైడ్ జంప్స్, సింగిల్ లెగ్ స్వ్కాట్స్, డంబెల్స్ ఎత్తడం, పుష్-అప్ ప్లాంక్ వంటి ఎక్సర్‌సైజెస్ చేయడం కోసం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో కే.ఎల్ రాహుల్ కూడా ఇవే వ్యాయమాలు చేస్తున్నాడు.
కరోనా వైరస్‌తో ఇబ్బందులు లేకుండా అన్నీ అనుకున్నట్టే జరిగి మార్చి 29న ఐపిఎల్ 2020 ఆరంభమై ఉంటే... కె.ఎల్. రాహుల్ ప్రస్తుతం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరపున ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడుతుండే వాడు. కానీ కోవిడ్-19 ఎటాక్ కారణంగా ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..